ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా? ఆ ప్రతిపాదనపై కేంద్రం తన విధానాన్ని తెలియజేసిందా? అని కనకమేడల ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కిరణ్ రిజుజు.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 214, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ టి. ధన్గోపాల్ రావ్ అండ్ అదర్స్ కేసులో 2018 అక్టోబర్ 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పునర్విభజన చట్టం 2014 కింద అమరావతి ప్రధాన కేంద్రంగా 2019 జనవరి 1న ఏపీ హైకోర్టును ఏర్పాటు చేశాం. 2020 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టు ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని ప్రతిపాదించారు” అని చెప్పారు.
ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ పిటిషన్లు, ఇతర కేసులు దాఖలయ్యాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు 2020 ఆగస్టు 4న ఉత్తర్వులు ఇచ్చింది. 2022 మార్చి 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో అమరావతి రాజధాని నగరం. ప్రాంతంలో మెుత్తం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని APCRDAని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన ధర్మాసనం మార్పుపై సంబంధిత రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు నిర్వహణ వ్యయాన్ని భరించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానిదే. అదే సమయంలో కోర్టు రోజువారీ పరిపాలన బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఉంటుంది. అందువల్ల హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది