బాలివుడ్ నుంచి హాలివుడ్‌కు వెళ్లి పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. హిందీ సినీ ప్రపంచంలో అగ్రతారగా ఉన్న ఈ భామ.. ఒక్కసారిగా బాలివుడ్‌ను వదిలేసి అమెరికా బాట పట్టింది. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో తాను బాలివుడ్‌ను వదిలేయడానికి గల కారణాలపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలెందుకు ప్రియాంక బాలివుడ్‌ను వీడాల్సి వచ్చింది. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టారు?. షారుఖ్‌తో స్నేహమే ఆమె కొంప ముంచిందా?
హాలివుడ్ ఆరంగేట్రం
2015లో వచ్చిన ‘క్వాంటికో’ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రియాంక హాలివుడ్లో నటిగా అడుగుపెట్టింది. కానీ అంతకుముందే ‘ఇన్ మై సిటీ’ మరియు ‘ఎక్సోటిక్’ వంటి పాటలతో అంతర్జాతీయ వేదికపై ప్రియాంక తన ప్రతిభను ప్రదర్శించింది. ఇక్కడ అగ్రతారగా ఉన్న తాను అసలు పశ్చిమ దేశాలవైపు చూసేలా చేసిన కారణాలను డాక్స్ షెఫెర్డ్ పాడ్‌కాస్ట్ ఆర్మ్‌చెయిర్ ఎక్స్పెర్ట్లో వివరించింది.
నన్ను బాలివుడ్ వెలివేసింది
బాలివుడ్ తనను కావాలనే వెలివేసిందని ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరితో తనకు ఉన్న విభేదాల కారణంగా తనకు సినిమాల్లో అవకాశం రాకుండా చేశారని చెప్పుకొచ్చింది. అప్పుడే తన మేనేజర్ అంజులా ఆచార్య తనకు ఆపద్భాందవుడిలా US మ్యూజిక్ వీడియోల్లో అవకాశాలను పరిచయం చేశాడని ప్రియాంక తెలిపింది. బాలివుడ్ నుంచి ఎలాగైన బయటపడాలనుకున్న తాను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నానని పేర్కొంది. బాలివుడ్ పాలిటిక్స్‌కు దూరంగా వెళ్లిపోవాలనే తాను USకు వెళ్లానని చెప్పింది. “ సంగీతం..నన్ను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించింది. సినిమాలు వదిలేయాలని కాదు కానీ అప్పటికే నేను ఎన్నో సినిమాలు చేశా అయినా అవకాశాల కోసం నేల నాకాల్సిన పరిస్థితి. అలా చేయడం నాకు ఇష్టం లేదు.” అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
గతంలోనూ
“గతంలో ది రణ్వీర్ షోలోనూ బాలివుడ్‌పై ప్రియాంక ఆరోపణలు చేసింది. “కొంతమంది నన్ను కావాలనే పక్కనబెట్టారు. నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేయాలనుకున్నారు.” అంటూ చెప్పింది.
కంగనా ఘాటు స్పందన
బాలివుడ్ మాఫియాపై నిత్యం ఆరోపణలు చేసే కంగనా రనౌత్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలతో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ వేధింపుల వల్లే ప్రియాంక బాలివుడ్‌ను వదిలేయాల్సి వచ్చిందని కంగనా ఆరోపించింది. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా సన్నిహితంగా ఉండటం సహించలేకపోయిన కరణ్ జోహార్ ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసింది. కరణ్ వేధింపులు తాళలేకనే ప్రియాంక ఇండియాను వదిలేసిందని అంది. “ గ్యాంగ్‌లు ఏర్పడి, ప్రియాంక చోప్రా బాలివుడ్‌ను వీడే వరకూ వెంటపడ్డారు. కరణ్ జోహారే ఆమెను బ్యాన్ చేశాడని అందరికీ తెలుసు’ అంటూ కంగనా రాసుకొచ్చింది. “ అసహ్యకరమైన, నీచమైన, విషపూరిత వ్యక్తి సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు. అతడి గ్యాంగ్, PR మాఫియాపై దాడి చేయాలి” అంటూ కంగనా ఉద్వేగంతో ట్వీట్లు చేసింది.
ప్రియాంక, కంగనా మాత్రమే కాదు బాలివుడ్ గ్యాంగ్, గ్రూపులపై పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఏఆర్ రెహమాన్, రవీనా టాండన్ అందులో కొందరు.
AR రెహమాన్
గతంలో ఏఆర్ రెహమాన్ బాలివుడ్లో తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మంచి సినిమాలకు నేనెప్పుడూ నో చెప్పను. కానీ అక్కడొక గ్యాంగ్ ఉంది. అసత్యాలను ప్రచారం చేస్తోంది” అన్నారు.
రవీనా టాండన్
1990,2000 కాలంలో వెండితెరను ఏలిన నటీమణుల్లో రవీనా టాండన్ ఒకరు. ఆమె కూడా సినీ పరిశ్రమలో రాజకీయాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ మీ ఓటమిని ముందుగానే ప్లాన్ చేసే కొందరు చెడ్డ వ్యక్తులు ఇక్కడున్నారు. నేను కూడా ఆ పరిస్థితి ఎదుర్కొన్నా. వారు మిమ్మల్ని సినీ పరిశ్రమలో లేకుండా చేయాలని చూస్తారు. ఇవి పక్కా తరగతి రాజకీయాల్లా ఉంటాయి. మీతో ఆడుకుంటారు” అంటూ వ్యాఖ్యలు చేసింది.
అయితే ప్రస్తుతం ప్రియాంక మాత్రం హాలివుడ్లో బిజీగా గడుపుతోంది. ఏప్రిల్ 28న ఆమె నటించిన “ సిటాడెల్’ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతోంది. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహించే ఓ సినిమాతో బాలివుడ్‌లోనూ తిరిగి అడుగుపెట్టే అవకాశముంది. ఈ సినిమాలో ఆలియా భట్, కత్రినా కైఫ్ కూడా నటిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!