నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్ కోల్పోయిన బ్యాంకులు.
1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్
2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్
3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్
4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్
5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్
6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్
7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల లైసెన్సు కాలపరిమితి మార్చి 31తో ముగిసింది. నిబంధనలు అతిక్రమిస్తుండటంతో దాదాపు 114 సార్లు రిజర్వు బ్యాంకు జరిమానాలు విధించింది. సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరించాయి. కానీ, ఈ బ్యాంకుల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకుల ద్వంద్వ స్థితి , బలహీనమైన ఫైనాన్సింగ్ వ్యాపారం కారణంగా స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తరచూ నిబంధనలు ఉల్లింఘిస్తున్న కారణంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది.
ఈ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించని కారణంగా 8 బ్యాంకులకు లైసెన్సులు రద్దు చేసింది. భవిష్యత్‌లో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందునా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సహకార బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది