• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • FAMILY MOVIES:  ఈ మధ్యకాలంలో  కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్‌ 5 తెలుగు సినిమాలు

    సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్‌ 5 చిత్రాలు ఇవే !

    బలగం

    ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

    రంగ మార్తాండ

    కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ. 

    రైటర్ పద్మభూషణ్

    యంగ్‌ హీరో సుహాస్‌ లీడ్‌ రోల్‌ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్‌లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా.

    మట్టి కుస్తీ

    భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు.

    ది గ్రేట్ ఇండియన్ కిచెన్

    సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది.  పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన  భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట  ఈ సినిమా చూసి…!

    జయ జయ జయ జయ జయహే

    ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్‌తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్‌పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్‌ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv