సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటించింది. పరశురాం దర్శకత్వం వహించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు మళ్లీ వెండిరపై కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంది..? అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
కథేంటంటే..
మహేశ్ (మహేశ్ బాబు) అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అప్పులు తీసుకున్నవారి వద్ద పైసా కూడా వదలకుండా వడ్డీతో సహా వసూలు చేస్తుంటాడు. ప్రతి రూపాయి చాలా ముఖ్యం అనుకునే క్యారెక్టర్. ఇక కళావతి (కీర్తిసురేశ్) ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్తుంది. కానీ అక్కడ మద్యానికి, జూదానికి బానిస అవుతుంది. దీంతో మహేశ్ వద్ద డబ్బు అప్పుగా తీసుకుంటుంది. ఆమెను చూడగానే ప్రేమించడం మొదలుపెట్టిన మహేశ్ అడగ్గానే డబ్బు ఇచ్చేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత కళావతి గురించి నిజం తెలుసుకుంటాడు. దీంతో తన అప్పు తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) వద్ద వసూలు చేసేందుకు ఇండియా వస్తాడు. రాజేంద్రనాథ్ తనకు పది వేల కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలని చెప్తాడు. మరి ఆ డబ్బు వస్తుందా..? మహేశ్ గతం ఏమిటీ..? ఇవన్నీ వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకుల పరిస్థితులను స్పృశిస్తూ రాసిన కథ ఇది. బడా వ్యాపార వేత్తలు వేల కోట్లు అప్పులు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్తుంటే చిన్న చిన్న వారి వద్ద కఠినంగా డబ్బు వసూలు చేస్తున్నారనే అంశం తెరపై చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు పరశురాం. మొదటి భాగం అంతా మహేశ్, కీర్తి సురేశ్ మధ్య లవ్ ట్రాక్, వెన్నెల కిశోర్ కామెడీతో సరదాగా గడిచిపోతుంది. రెండో భాగంలోనే అసలు కథ మొదలవుతుంది. కానీ సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకుడు కొన్ని సన్నివేశాలను అతికించినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు లాజిక్స్ మిస్ అవుతుంటాయి. కథ ఊహించినట్లుగా సాగిపోతుంది. రాజేంద్రనాథ్ పాత్రను మొదట పవర్‌ఫుల్‌గా చూపించినప్పటికీ చివరికి వచ్చేసరికి పాత్రలో బలం తగ్గుతూ వస్తుంది. అయితే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి. కథలో పాయింట్ చిన్నదే అయినప్పటికీ దానికి లవ్‌స్టోరీని మహేశ్ బాబు హీరోయిజాన్ని కలిపి తెరపై చూపించాడు.
ఎవరెలా చేశారంటే..
అయితే మహేశ్ తన స్టైల్, గ్రేస్, యాక్టింగ్‌తో అదరగొట్టాడు. మహేశ్ ఫ్యాన్స్‌కు తమ హీరోను ఇలా చూడటం కనుల పండుగలా ఉంటుంది. గ్లామర్ లుక్స్‌తో పాటు కామెడీ టైమింగ్, డ్యాన్స్‌తో కూడా మెస్మరైజ్ చేశాడు. ఇక కీర్తి సురేశ్ కళావతి పాత్రలో చాలా అందంగా కనిపించింది. ఆమె ఇదివరకు చేసిన పాత్రలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. మొదటి భాగం మొత్తం ఆమె పాత్రకు చాలా ప్రాదాన్యత ఉంటుంది. కానీ రెండో భాగంలో పాత్ర నిడివి తగ్గిపోయింది. ఇక వెన్నెల కిశోర్, మహేశ్ బాబు కాంబినేషనల్లో కామెడీ సీన్స్ అలరించాయి. సముద్రఖని తన పాత్ర పరిదిమేరకు నటించాడు. ఇక సుబ్బరాజు, నదియా, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. మది సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. దర్శకుడు పరశురాం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆయన అభిమానులు తమ హీరోను ఎలా చూడాలనుకుంటారో అలా చూపించడంలో విజయం సాదించాడు.
బలాలు:
కామెడీ
మహేశ్-కీర్తి సురేశ్ నటన
యాక్షన్ సన్నివేశాలు
బలహీనతలు:
సెకండాఫ్
లాజిక్ లేని సన్నివేశాలు
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి