సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. పరశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం దుమారం రేపుతోంది. ఈ సినిమాను కొందరికి అనుకూలంగా తీశారని ఒక వర్గం భావిస్తుంటే, పవన్ కల్యాణ్, రఘురామ కృష్ణంరాజుకి వ్యతిరేకంగా కావాలనే సీన్లు చిత్రీకరించారంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అసలు ఈ మూవీలో రాజకీయ అంశం ఏంటి..? ఆ పొలిటికల్ లీడర్స్ పేర్లు ఎందుకు ప్రస్తావనకు వచ్చాయో ఓసారి పరిశీలిద్దాం.
ఈ డైలాగే కారణమా..?
ఈ చిత్రంలో మహేశ్‌బాబు ఒక సన్నివేశంలో ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనే డైలాగు చెప్పారు. ఈ డైలాగుతో అసలు రగడ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ఈ డైలాగును అసలు ఈ మూవీలో ఎందుకు చెప్పారని..? వైసీపీకి మద్దతు తెలపడానికే ఈ డైలాగు ఉపయోగించారని..? ప్రతిపక్షపార్టీల నేతలు ట్రోల్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ అభిమానులు మాత్రం ఈ డైలాగును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు గతంలో సూపర్‌స్టార్ కృష్ణ కూడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికలకు పోటీ చేయడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కొంచెం సన్నిహితంగా ఉండటం లాంటి అంశాలు ప్రతిపక్షాల నాయకుల వాదనలకు బలంగా నిలిచాయి. కాని ఈ సన్నివేశాన్ని ఎలాంటి రాజకీయ కోణంతో తెరకెక్కించలేదని, ఒకవేళ అలాంటి సన్నివేశం కాంట్రవర్సీ ఉందని భావిస్తే అసలు మహేశ్‌బాబు ఆ సన్నివేశాల్లో నటించరని డైరెక్టర్ పరశురాం క్లారిటీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్, రఘురామ కృష్ణంరాజులను ఎందుకు టార్గెట్ చేశారు..?
ఈ చిత్రంలో సముద్ర ఖని ఎంపీ క్యారెక్టర్లో నటించారు. లోన్ ఏజెంట్ అయిన మహేశ్‌బాబును మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. రియల్ లైఫ్‌లో సముద్ర ఖని పాత్రను వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ముడిపెట్టారు. కృష్ణంరాజు కూడ ఎంపీఅని, సముద్రఖని లాగానే జగన్‌ని మోసం చేయడానికి ప్రయత్నించాడని పలువురు సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యాప్తి చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సన్నివేశం కూడ రాజకీయ చర్చకు దారితీసింది. లోన్ రికవరీ ఏజెంట్‌గా మహేశ్‌బాబు అప్పు తీసుకున్న వ్యక్తిని కొడుతుంటాడు. ఈ సందర్భంలో చేతిలో ఉన్న గాజు గ్లాసుని పగులగొడతాడు. ఈ సన్నివేశాన్ని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించే తీశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా కాకుంటా జగన్‌లా నటించాడని పవన్ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నివేశాలను రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కించలేదని, వినోదం పంచడానికి మాత్రమే ఆ డైలాగు ఉపయోగించామని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి