• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Coolie Movie: రోలెక్స్‌ తరహాలో వైలెంట్‌గా నాగ్‌ మామ.. ‘కూలీ’ నుంచి యాక్షన్‌ సీన్‌ లీక్‌!

    సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం ‘కూలీ’ (Coolie) చిత్రంలో నటిస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాటిక్‌ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘కూలీ’ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ బయటకొచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు కూలీ మూవీకి సంబంధించి ఏకంగా ఓ వీడియోనే బయటకొచ్చింది. అది కూడా టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో కావడంతో సోషల్‌ మీడియా మెుత్తం షేక్ అవుతోంది. వీడియో లీక్‌పై దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. 

    రూత్‌లెస్‌ యాక్షన్‌

    రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇటీవల నాగ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. సైమన్‌ పాత్రలో అతడు కనిపించనున్నట్లు ఆ పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపిస్తున్నాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహా చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌  చేస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ గట్టిగానే ప్లాన్‌ చేశాడని ప్రశంసిస్తున్నారు. 

    బాధపడ్డ లోకేష్‌ కనగరాజ్‌

    నాగార్జున్‌ పాత్రకు సంబంధించిన యాక్షన్‌ సీన్ నెట్టింట ప్రత్యక్షం కావడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ షాక్‌కి గురయ్యారు. తమ రెండేళ్ల కష్టాన్ని ఇలా ఒక్క పనితో, ఒక్క లీక్‌తో నాశనం చేశారని బాధపడ్డారు. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాపై ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ను ఇలా పాడుచేయవద్దని నెటిజన్లకు సూచించారు. ఆ వీడియోను ఎవ్వరూ షేర్‌ చేయవద్దని రిక్వెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే నాగ్‌ వీడియోను మూవీ యూనిట్‌కు చెందిన వారే లీక్‌ చేసి ఉండొచ్చని సమాచారం. షూట్‌లో భాగమైన వారే లీక్‌ చేసి ఉంటారని మేకర్స్‌ సైతం అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

    వైజాగ్‌ నుంచి లీక్‌..!

    ‘కూలీ’ చిత్రంలో పలువురు స్టార్‌ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగార్జునతో పాటు కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. స్టార్‌ హీరోయిన్ శృతిహాసన్‌, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరుగుతోంది. నాగార్జునకు సంబంధించిన వీడియో ఇక్కడ నుంచే లీకై ఉండొచ్చని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. కూలీ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv