ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్, సాంగ్స్‌కు రీల్స్ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన వార్నర్ సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మెుదలుపెడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప 2’లో కీ రోల్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2‘. అయితే ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌లో వార్నర్ గన్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ ‘పుష్ప 2’ సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ‘పుష్ప 2’ మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ప్రచారం నిజం కావాలని వార్నర్ అభిమానులు కోరుకుంటున్నారు.
సుకుమార్ ప్లాన్ ఇదేనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ (Pushpa: The Rise)తో డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట గతంలో ఇండియా మెుత్తం సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు వార్నర్ రీల్స్ కూడా చేశాడు. అప్పట్లో అవి తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు మైదానంలో పలుమార్లు ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ మేనరిజాన్ని వార్నర్ అనుసరించాడు. తద్వారా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్ క్రేజ్‌ను ‘పుష్ప 2’లో వినియోగించుకోవాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ‘పుష్ప 2’లో డేవిడ్ మామను తప్పకుండా చూసే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్‌తో చేరువ
టీమిండియా ఆటగాళ్లతో సమానంగా వార్నర్‌ను తెలుగు క్రికెట్ అభిమానులు గౌరవిస్తుంటారు. వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సైతం అందించాడు. దీంతో వార్నర్‌కి తెలుగు అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అటు వార్నర్ సైతం ఇందుకు ప్రతిగా తెలుగు సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ, సినిమా డైలాగ్స్ చెబుతూ రీల్స్ చేసేవాడు. ఇలా తెలుగువారికి వార్నర్ దగ్గరయ్యాడు. వార్నర్ పలు సందర్భాల్లో హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. హైదరాబాద్‌ను మిస్ అవుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.
రాజమౌళితో యాడ్ షూట్
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి గతంలో ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు. ఒక వేళ తన సినిమాలో డేవిడ్ వార్నర్ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో వార్నర్ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్ ఇవన్నీ ఊహించుకొని ఒక్కసారిగా భయపడతాడు. అప్పట్లో ఈ యాడ్ విపరీతంగా వైరల్ అయ్యింది. మళ్లీ ఓసారి చూసేయండి.
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!