• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్‌’ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 

    లేటెస్ట్ అప్‌డేట్‌ అదుర్స్‌

    ప్రభాస్‌ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్‌ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్‌ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్‌ ట్రీట్‌ (టీజర్‌/ట్రైలర్‌ రిలీజ్‌) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్‌ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌ వింటేజ్‌ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్‌ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ‘రాజా సాబ్‌’ రిలీజ్‌ కానుంది.

    రాజా సాబ్‌ ఫొటో లీక్‌!

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రిలీజ్‌ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో ఫుల్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్‌ రిద్ది కుమార్‌ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్‌ సందర్భంగా మానిటర్‌ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్‌ చేసినట్లు కనిపిస్తోంది. 

    రీ-రిలీజ్‌ల సందడి

    మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్‌ చేసి స్పెషల్‌ షోస్‌ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్‌’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మిర్చి’, ‘రెబల్‌’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్‌ చేస్తున్నారు. 

    భారీ ధరకు మ్యూజిక్ రైట్స్‌

    రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్‌ రాజాసాబ్‌ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్‌ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. 

    వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు!

    ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv