• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్‌ రెడ్డి వంగా.. ఏమైందంటే?

    తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘పొట్టేల్‌’ (Pottel). అక్టోబర్‌ 25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అనన్య బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ ఎవరికైనా ఇచ్చారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్న టాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అనన్య మరోమారు మాట్లాడారు. అలాగే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తమ టీమ్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

    సందీప్‌పై అనన్య ప్రశంసలు

    యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్‌’ (Pottel). మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ వేడకకు  ‘అర్జున్ రెడ్డి‘, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్‌‘ చిత్రాల దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నటి అనన్య మాట్లాడారు. తమ ‘పొట్టేల్‌’ ప్రమోషన్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి కాదు రెండుసార్లు తమ మూవీ వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లడం కోసం మీరు చేస్తున్న సపోర్ట్‌ మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు. 

    ‘రంగస్థలం’ తర్వాత పొట్టేలే: సందీప్‌ రెడ్డి 

    దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు సాహిత్‌ ఓ రోజు తనకు చెప్పాడని సందీప్‌ అన్నారు. కథ వినగానే ‘ఇది చిన్న కథ కాదు పెద్దది’ అని అనిపించిందన్నారు. తాను ఇప్పటికే సినిమా చూశానని బాగా నచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆ విధంగా ఉంటుందని అసలు ఊహించలేదన్నారు. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆడియన్స్‌ను ఉద్దేశించి చెప్పారు. ‘రంగస్థలం‘ తర్వాత పూర్తి స్థాయి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో చూసిన సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. చిన్న సినిమాలను ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటూ ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేశారు. 

    సంస్కారం ఉంటే ఆ ప్రశ్నలు వేయరు: అనన్య

    ‘పొట్టేల్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అనన్య నాగళ్ల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కమిట్‌మెంట్‌పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను మరోమారు లేవనెత్తుతూ చురకలు అంటించారు. ‘ఇంత డైరెక్ట్‌గా సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నా. పొట్టేల్‌ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారని భావించా. కమిట్‌మెంట్‌ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. హీరోయిన్లు మేకప్‌ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య కోరారు.

    అసలేం జరిగిందంటే?

    పొట్టేల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. ‘ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్‌ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్‌ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు’ అని ప్రశ్నించింది. ‘ఇది వందశాతం రాంగ్‌ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్‌ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు’ అని అనన్య పేర్కొంది. 

    రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్‌

    అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్‌ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్‌ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్‌ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్‌ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్‌ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్‌ చేశారు. మహిళా రిపోర్టర్‌ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్‌ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv