భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఒక సినిమాను ఇలా ఉంటూనే ఆడియన్స్ చూస్తారు? అనే అభిప్రాయం నుంచి కొత్తగా తీస్తే కచ్చితంగా ఆదరిస్తారని నిరూపించాడు. సంచనాల దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్ వర్మను సైతం తన మేకింగ్ స్కిల్స్‌తో సర్‌ప్రైజ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇదంతా ఆన్ స్క్రీన్‌పైన ప్రతీ ఒక్కరు గమనించినవే. కానీ ఆఫ్ స్క్రీన్‌లోనూ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కు ఓ ప్రత్యేకత ఉంది. చాలా నిశితంగా పరిశీలిస్తే తప్పా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదేంటో ఈ కథనంలో చూద్దాం.
హీరోలకు తగ్గట్లు మేకోవర్
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇప్పటివరకూ మూడు చిత్రాలు తీశాడు. తన ఫస్ట్ తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి సందీప్ సక్సెస్ అయ్యాడు. గతేడాది ‘యానిమల్’ (Animal)తో వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించాడు. ఇదిలా ఉంటే సందీప్ తన సినిమాల షూటింగ్ సమయంలో విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు. తమ సినిమాల్లో హీరోలు ఏ మేకోవర్‌లో అయితే ఉంటారో సరిగ్గా అదే స్టైల్‌లోకి తన లుక్‌ను మార్చుకుంటాడు. ఇది చాలా మంది గమనించకపోవచ్చు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు వస్తే అందులో విజయ్ దేవరకొండ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించాడు. సందీప్ కూడా షూటింగ్ సమయంలో సరిగ్గా అదే లుక్‌ను మెయిన్‌టెన్ చేశాడు. ‘యానిమల్’ మూవీలోనూ రణ్‌బీర్ సింగ్ పాత్రకు తగ్గట్లు హెయిర్ చాలా పొడుగ్గా పెంచి, రణ్‌బీర్ స్టైల్‌లో గడ్డం పెంచాడు. మూవీ ప్రమోషన్స్‌కు సైతం అదే లుక్‌లో హాజరయ్యారు.
స్పిరిట్ లుక్‌లోకి సందీప్!
‘యానిమల్’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ‘స్పిరిట్’ (Spirit) అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆల్‌మోస్ట్ కాన్ఫర్మ్ అయ్యింది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పటివరకూ చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ ఇదే కావొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. రీసెంట్‌గా సందీప్‌తో దిగిన ఫొటోలను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇందులో సందీప్ గడ్డం లేకుండా కనిపించాడు. షార్ప్ మీసాలు, పిల్లి గడ్డంతో స్మార్ట్‌గా దర్శనమిచ్చాడు. దీంతో ‘స్పిరిట్’ ప్రభాస్ కూడా ఇదే మేకోవర్‌లో కనిపించే ఛాన్స్ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి జరుగుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.
మూడు విభిన్న లుక్స్‌లో ప్రభాస్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్ లుక్ అనుగుణంగా పోలీసు పాత్రకు ప్రభాస్ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది కాకుండా మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్ అలరించే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
యూరప్‌లో ప్రభాస్ రొమాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి (Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (S.S. Thaman) సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మెుత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో రెండు సాంగ్స్ విదేశాల్లో షూట్ చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్, హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) కాంబోలో ఈ రెండు డ్యూయెట్ పాటలు ఉంటాయని సమాచారం. ఈ సాంగ్స్ షూట్ కోసం వారు త్వరలోనే యూరప్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది