• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన

    షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్‌’ (Raees) సినిమా ద్వారా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్‌ నటి మహిరా ఖాన్‌ (Mahira Khan), తొలి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ సక్సెస్‌ను తగిన విధంగా కెరీర్‌లో కొనసాగించలేకపోయారు. మహిరా కెరీర్‌కి బాలీవుడ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాలు అర్థాంతరంగా తన కెరీర్‌ను ముగించేలా చేశాయి. ముఖ్యంగా, 2017లో నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు మహిరా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపించాయి.

    నాటి ఫోటోలపై మహిరా స్పందన

    తాజాగా మహిరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు ఓ ప్రముఖ మీడియా ‘ది లిటిల్ వైట్ డ్రెస్’ అనే టైటిల్‌తో ఆర్టికల్ రాసింది. దానిలో నాకు సంబంధించి వచ్చిన వార్తలు చదివినప్పుడు మొదట ఆ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయా. ‘పాకిస్థాన్‌ నుంచి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటి ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గడం ఏమిటి?’ అనే వాక్యం చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నా కెరీర్‌ ముగిసిపోతుందా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు.

    వ్యక్తిగత జీవితంపై ప్రభావం

    ‘‘ఆ ఫోటోల కారణంగా నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో విడాకులు పొందాను, సింగిల్‌ పేరెంట్‌గా జీవించాను. రోజూ ఆత్మన్యూనతతో బాధపడుతూనే ఉండేదాన్ని. అయితే, ఆ కష్టసమయాల్లో నాకు అభిమానుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది’’ అని మహిరా పేర్కొన్నారు.

    రణ్‌బీర్‌తో లీకైన ఫొటోల వివాదం

    2017లో న్యూయార్క్‌లో రణ్‌బీర్ కపూర్‌తో మహిరా దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా కనిపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని బాలీవుడ్‌లో గాసిప్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ సంఘటన తరువాత మహిరా బాలీవుడ్‌లో మరే సినిమాలోనూ కనిపించలేదు.

    వ్యక్తిగత జీవితం

    మహిరా ఖాన్ ఆమె స్నేహితుడు అలీ అస్కారీని వివాహమాడి, 2015లో విడిపోయారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మహిరా వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను 2023లో వివాహమాడారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా శాంతియుత జీవితం గడుపుతున్నారు.

    మహిరా ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ తన అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ తనతో ఉంటుందని అభిప్రాయపడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv