సాధారణంగా ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా ముఖ్యం. హీరో, హీరోయిన్, డైరెక్టర్ సహా మూవీ బృందమంతా ప్రచారాల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ ప్రమోషన్స్‌కు గ్లామర్ తీసుకురావడంలో హీరోయిన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అయితే ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రమోషన్స్‌లో ఆ గ్లామరే మిస్ అయ్యింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ‘గేమ్ ఛేంజర్’ మరో ఏడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ టీమ్ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ వేడుకలకు హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) డుమ్మా కొడుతుండటం చర్చకు తావిస్తోంది. ఆమె మిస్సింగ్‌కు కారణం ఏమై ఉంటుందా? అని సినీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
కీలక ఈవెంట్స్‌కు దూరం..
‘గేమ్ ఛేంజర్‘ (Game Changer) చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా చేసింది. హీరోయిన్లను అందంగా చూపించడంలో డైరెక్టర్ శంకర్‌కు మంచి పేరుంది. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్‘లోనూ కియారాను ఆయన చాలా అందంగా చూపించారు. పాటలు, టీజర్, ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో కియారా పాల్గొనకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. గురువారం (జనవరి 2) జరిగిన ట్రైలర్ లాంట్ ఈవెంట్లో ఆమె పాల్గొనలేదు. అంతకుముందు డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సైతం ఆమె అందుబాటులో లేదు. లక్నోలో జరిగిన ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో మాత్రమే కియారా పాల్గొంది. ఎంతో కీలకమైన ప్రమోషన్స్‌కు హీరోయిన్ దూరంగా ఉండటం ఏంటని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
టీమ్‌తో విభేదాలు వచ్చాయా?
‘గేమ్ ఛేంజర్’కు కియారా దూరంగా ఉండటంతో నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు. చిత్ర బృందంతో తలెత్తిన వివాదం కారణంగానే ఆమె ప్రమోషన్స్‌కు రావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీమ్ వ్యవహారశైలిపై కియారా చాలా అసంతృప్తితో ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే కియారా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘టాక్సిక్’, ‘వార్ 2’ చిత్రాల్లో కథానాయికగా చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముందే డేట్స్ కమిట్ కావడంతో కియారా ఆయా చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వస్తున్నట్లు సమాచారం. అందువల్లే ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు హాజరుకాలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మెగా పవర్ ఈవెంట్‌కైనా వస్తుందా?
‘గేమ్ ఛేంజర్‘ టీమ్.. ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జనవరి 4న రాజమండ్రిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. మెగా పవర్ ఈవెంట్ అంటూ ఈ వేడుకపై చిత్రం బృందం భారీగా అంచనాలు పెంచేసింది. అటు బాబాయి, అబ్బాయి ఒకే వేదికపై కనిపించనుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ బిగ్ ఈవెంట్‌కైనా కియారా హాజరుకావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆమె వస్తే ఈ వేడుక మరింత అందంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కియారా వస్తుందో లేదో చూడాలి.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!