‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్ (Yash) పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) సైతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడంతో నేషనల్ వైడ్‌గా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత బలపడింది. దీంతో అతడు చేస్తున్న ‘టాక్సిక్’ (Toxic) ఫిల్మ్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా ఇవాళ యష్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియోనూ రిలీజ్ చేసింది. అయితే ఈ గ్లింప్స్‌పై ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే సాలిడ్ క్యాప్షన్ కూడా పెట్టారు. గతేడాది ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కాగా ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవాళ యష్ పుట్టిన రోజు నేపథ్యంలో ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో యష్ రెట్రో కారులో క్లబ్‌లోకి ఎంతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. క్లబ్‌లోని కుర్రకారు ఎంజాయ్ చేస్తుండగా తన వద్దకు వచ్చిన బ్రిటిష్ యువతితో చాలా చనుగా ప్రవర్తించాడు. బీర్ బాటిల్‌ను ఆమెపై పోస్తూ చాలా రొమాంటిక్‌గా కనిపించాడు. మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చెప్పవచ్చు. లుక్స్ పరంగా యష్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా రొమాంటిక్ మోడ్‌లో హీరో గ్లింప్స్‌ను చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరిలో అసంతృప్తి..!
‘కేజీఎఫ్’ మూవీ సిరీస్‌లలో యష్ ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి తర్వాత చేస్తున్న ‘టాక్సిక్’లోనూ యష్ అంతే పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల క్రితం ‘టాక్సిక్’ ఫస్ట్ గ్లింప్స్‌పై అప్‌డేట్ రాగానే.. పక్కా యాక్షన్ ప్యాకేజ్‌గా ఉంటుందని అంతా భావించారు. ఇందుకు భిన్నంగా పూర్తి రొమాంటిక్ మోడ్‌లో గ్లింప్స్‌ను కట్ చేయడంపై కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్ గ్లింప్స్ కండోమ్ యాడ్‌లా ఉందంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘కేజీఎఫ్’ తరహాలోనే యష్ లుక్స్ ఉన్నాయని, కొత్తదనం లోపించిందని పోస్టులు పెడుతున్నారు.
తొలి నుంచి వివాదాలే..
‘టాక్సిక్’ సినిమాను యష్ పట్టాలెక్కించినప్పటీ నుంచి ఏదోక వివాదంలో ఈ మూవీ చిక్కుకుంటూనే వచ్చింది. తొలుత ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పనితీరుపై యష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే యోచనలో కూడా ఆయన ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొద్ది రోజుల తర్వాత కర్ణాటకలో షూటింగ్ కోసం చెట్లను నరికి మరో వివాదాన్ని ‘టాక్సిక్’ నెత్తికి ఎత్తుకుంది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు ఈ చిత్ర బృందంపై కేసు కూడా నమోదు చేయడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన జరగ్గా కర్ణాటకలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా గ్లింప్స్‌ను దారుణంగా తప్పుబడుతూ నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
‘కేజీఎఫ్’తో యష్ కెరీర్ మలుపు!
‘కేజీఎఫ్‌కు’ ముందు యష్ కన్నడలో 19 చిత్రాల్లో నటించాడు. అన్ని మూవీస్ చేసినప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. టైర్-2 హీరోగా మాత్రమే శాండిల్‌వుడ్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘కేజీఎఫ్’ (KGF) చేశాడో అతడి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో అతడి గురించి చర్చించుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం మరింత సక్సెస్ కావడంతో ఆ ఫేమ్ మరింత బలపడింది. దానిని నిలబెట్టుకునే క్రమంలోనే యష్ ఆచితూచి అడుగువేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2 తర్వాత సరైన సబ్జెట్ కోసం రెండేళ్ల పాటు ఎదురు చూశాడు. గతేడాది ‘టాక్సిక్’ను పట్టాలెక్కించాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్