మీరు ఏ ఇంటర్వ్యూకి హాజరైనా మొట్టమొదట మీకు ఎదురయ్యే ప్రశ్న “Tell me about yourself” – అనగా “మీ గురించి చెప్పండి” అని. ఇది ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరికీ తెలుసు.
అయితే ఇంటర్వ్యూయర్లు (ఇంటర్వ్యూ చేసే వారు) చెప్పేది ఏమిటంటే… ఈ ప్రశ్న మొదటనే కచ్చితంగా ఎదురవుతుంది అని తెలిసినప్పటికీ ఎంతోమంది దీనికి సరిగ్గా సమాధానం చెప్పేందుకు వారి వద్ద తడబడతారట. ఈ సమాధానం చెప్పేటప్పుడు వచ్చే ఒత్తిడి, ఆ ఒక్క వాక్యంలో ఉండే సంక్లిష్టత, ఒంటిలో కలిగే ఉద్రిక్తత మాటల్లో వివరించలేము. మన పూర్తి జీవితం గురించి ఒక్క పేరాగ్రాఫ్‌లో చెప్పాలి. దీనికి ఎంతో పరిపక్వత కూడా అవసరం. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి?
అసలు సమాధానం ఏమని చెప్పాలి…. అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇంటర్వ్యూయర్లు అసలు ఈ ప్రశ్నను ఎందుకు అడుగుతారో తెలుసా? అది ముందు తెలుసుకుంటే అప్పుడు పై ప్రశ్నకు సమాధానం మీకు సులువుగా దొరుకుతుంది.
అసలు ప్రతీసారీ ఈ ప్రశ్ననే ఎందుకు అడుగుతారు?
ఇప్పటి వరకు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఒక ఇంటర్వ్యూ ను కచ్చితత్వంతో మొదలు పెట్టేందుకు మొదటిగా ఈ ప్రశ్న అడిగితేనే ఇంటర్వ్యూయర్ కి కూడా కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది. అసలు ఉద్యోగానికి వచ్చిన వారిని ఎలాంటి ప్రశ్నలు వేయాలి అన్న ఒత్తిడి ఇంటర్వ్యూ చేసే వారికి కూడా ఉంటుంది. కాబట్టి దాని నుండి కొద్దిగా ఉపశమనం కోసం మీరు మీ గురించి ఏమి చెబుతారా అన్న ఆసక్తితో వారు ఆ ప్రశ్న వేసి మీ సమాధానం కోసం ఎదురు చూస్తారు. ఇక మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి వారు తర్వాత అడిగే ప్రశ్నలను అప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటారు. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. ఒక ప్రశ్న నుండి మరొకటి ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెబితే అప్పుడు మీకు తర్వాత ఎదురయ్యే మిగిలిన ప్రశ్నలకుఇక అసలు ఈ ప్రశ్నలు కూడా మీకు సమాధానం తెలిసినవే ఉంటాయి.
ప్రశ్న: మీ గురించి చెప్పండి (Tell Me About Yourself)
సమాధానం: ముందుగా వీలైనంతగా మీ సమాధానాన్ని కుదించాలి అన్న విషయాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత ఈ సమాధానాన్ని మూడు భాగాలుగా విభజించాలి.
ప్రస్తుతం, గతం, భవిష్యత్తు..!
ప్రస్తుతం మీరు ఏ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు… దానివల్ల మీరు వ్యక్తిగా ఎలా ఎదగాలి అని అనుకుంటున్నారు… అలాగే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సాధించి ఉంటే… దాని గురించి క్లుప్తంగా వివరించండి.
ఆ తర్వాత మీ గతం చదువు లేదా పూర్వ ఉద్యోగానుభవం గురించి కొద్దిగా ప్రస్తావించండి. అయితే ఈ ప్రస్తావనలో మాత్రం ప్రస్తుతం మీరు అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండేటట్లు చూసుకోండి.
ఇక భవిష్యత్తు విషయానికి వస్తే ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? దీనికి మీరు ఎటువంటి కార్యాచరణ మనసులో పెట్టుకున్నారు అన్న విషయాన్ని వివరిస్తే సరిపోతుంది.
ఇక ఇంటర్వ్యూ చేసే వారు మీ నుండి ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఆశిస్తున్నారు అంటే… మీరు అప్లై చేసిన ఉద్యోగం గురించి ముందే కొద్దిగా శోధన చేసి ఆ ప్రత్యేక పూర్తి సమాచారాన్ని వారికి ఇస్తే చాలు. అలాగే ఇది మీ పైన వారికి మొట్టమొదటి అభిప్రాయం ఏర్పడే సమయం కాబట్టి దీని ప్రభావం తర్వాత ఘడియల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మనసులో గుర్తుపెట్టుకుని ఉండాలి.
అదనపు కీ-పాయింట్స్
- మొదటగా మీరు మాట్లాడే పద్ధతి ప్రొఫెషనల్ గా ఉండేలాగా చూసుకోండి.
- మితిమీరిన భావావేశంతో కాకుండా కొద్దిగా పరిధిమేర భావేశంతో మాట్లాడితే సరిపోతుంది.
- మీరు అప్పటికే ఇచ్చిన CV లేదా RESUME లో ఉండే అంశాలను పదేపదే ప్రస్తావించకండి.
- తక్కువ సేపు చెప్పినా ఉత్సాహంగా చెప్పండి. మధ్యలో ఎక్కడా శక్తిని ఎక్కడ కోల్పోవద్దు.
- ప్రాక్టీస్ చేయండి కానీ బట్టీ పట్టవద్దు.
చివరి మాట: మనిషిని బట్టి మీరు మాట్లాడే చెప్పే సమాధానం కూడా మారాలి.
ఉదా: బాస్ తో అయితే టెక్నికల్ సమాచారం, సి -లెవెల్ ఎగ్జిక్యూటివ్ తో కంపెనీ గురించి, రిక్రూటర్ తో అయితే మరొకలాగా మాట్లాడాలి. ఇలా ఎన్నో అంశాలను లో ఉంచుకొని ఎవరికి తగిన సమాధానం వారికి ఇస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి