టీమిండియా మాజీ స్పిన్నర్ భజ్జీ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. ఇండియా జట్టును ఎవరైనా సరే ఏదైనా అంటే అతడు ఊరుకోడు. అటువంటిది పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ట్విట్టర్ వేదికగా టీమిండియా పాక్ మీద ఓడిపోవడంపై సెటైర్లు వేశాడు. దీంతో కోపమొచ్చిన టర్బోనేటర్ 2010 ఆసియా కప్‌లో అమీర్ బౌలింగ్‌లో సిక్సు కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన వీడియోను షేర్ చేశాడు. దీనికి అమీర్ స్పందిస్తూ 2006 లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది ఒకే ఓవర్లో కొట్టిన నాలుగు సిక్సుల వీడియోను షేర్ చేశాడు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన టర్బోనేటర్ 2010 లార్డ్స్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని బయటకు తీశాడు. 2010లో లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్ ఇంగ్లండ్ తో టెస్టు ఆడుతున్న సమయంలో పాక్ సీమర్ అయిన అమీర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి భారీ నోబాల్ విసిరాడు.
‘లార్డ్స్ నోబాల్ గుర్తుకు లేదా? నో బాల్ వేసేందుకు ఎంత ముట్టజెప్పారు’ అని అప్పటి ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిస్పందనగా పాక్ క్రికెటర్ హర్బజన్ బౌలింగ్ యాక్షన్ గురించి ట్వీట్ చేశాడు. అతడిది అక్రమ బౌలింగ్ యాక్షన్ అని విమర్శించాడు. నా గతం గురించి తవ్వితే ఏమీ రాదని 3 రోజుల కిందటి మ్యాచ్ గురించి ఆలోచించమని అన్నాడు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?