టీ20 క్రికెట్ అంటే సిక్సులు, ఫోర్ల హోరు.. బ్యాటర్ల జోరు.. బౌలర్ల బేజారు అచ్చంగా ఇదే జరిగింది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 సిరీస్‌లో. నార్తాంప్టన్‌షైర్, వార్విక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఏకంగా 424 పరుగులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు బ్యాటర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ చేధనకు దిగిన జట్టు 7 బంతులు మిగిలుండగానే 212 పరుగులు చేసింది. ఒక దశలో 50లోపే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయిన ఆ జట్టు తర్వాత వచ్చిన బ్యాటర్ల వీరవిహారంతో లక్ష్యాన్ని చేధించింది. వార్విక్‌షైర్ విన్నింగ్ మూవ్‌మెంట్స్ చూసేందుకు Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి.