శర్వానంద్- రష్మిక మంధాన జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో రిలీజ్ అయ్యాయి. దీంతో మూవీ వీక్షించిన తెలుగు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
చిరు పాత్రలో నటించిన శర్వానంద్ వయసు మీద పడుతుండటంతో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కాని కుటుంబ సభ్యుల అతిప్రేమ కారణంగా ఏ పెళ్లిసెట్ కాకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆధ్య(రష్మిక మంధాన)తో చిరుకు పరిచయం ఏర్పడుతుంది. కాని వీరిద్దరి పెళ్లితో ఒక్కటయ్యారా?లేదా? అనేది అసలు కథ. ఈ చిత్రంలోని సన్నివేశాలను డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించారు. కొన్ని హాస్యం తెప్పించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ సీన్లు కూడ జోడించాడు. ఇంతకి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది? సెకండాఫ్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా ఉందో?మీరే చూసేయండి.