• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆధార్‌-పాన్‌ గడువు పెంపు: లింక్‌ చేయడమెలా? ఫీజు చెల్లించడమెలా? Step By Step Guide

    ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ కార్డు-పాన్‌ కార్డు లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన సర్కారు మరోసారి  మార్చి 31,2023ను నుంచి జూన్‌ 30 వరకు పెంచింది. జూలై 1 నుంచి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్ కార్డులు పనిచేయవు.

    మీ ఆధార్‌-పాన్‌ లింక్‌ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి:-

    మీ ఆధార్‌-పాన్ లింక్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి పన్నుదారుడు ఇన్‌కమ్‌ ట్యాక్‌ e-ఫైలింగ్‌ పోర్టల్‌కు వెళ్లాలి.

    • హోం పేజ్‌లో క్విక్‌ లింక్స్‌పై క్లిక్‌ చేసి, లింక్ ఆధార్‌ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.
    • అక్కడ ఉన్న రెండు బాక్సుల్లో ఆధార్‌ నంబర్‌, పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి
    • ఒక వేళ ఆధార్‌-పాన్ లింక్ అయి ఉంటే “Your PAN is already linked to given Aadhaar” అని వస్తుంది.
    • ఒకవేళ ఆధార్‌ పాన్‌ లింక్‌ కాకపోతే  “PAN not linked with Aadhaar. Please click on ‘Link Aadhaar’ to link your Aadhaar with PAN”. అని పాప్‌అప్‌ వస్తుంది.
    • ఒకవేళ మీ ఆధార్‌-పాన్ లింకింగ్‌ ప్రాసెస్‌లో ఉంటే “Your Aadhaar-PAN linking request has been sent to UIDAI for validation. Please check the status later by clicking on ‘Link Aadhaar Status’ link on Home Page.” అనివస్తుంది.

    ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌కు లాగిన్‌ అవ్వడం ద్వారా కూడా ఆధార్‌-పాన్ లింక్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

    • పన్నుదారుడు లాగిన్‌ అయిన తర్వాత ‘Dashboard’కు వెళ్లి ‘Link Aadhaar Status’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
    • ‘My Profile’ కు వెళ్లి ‘Link Aadhaar Status’ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
    • ఆధార్‌ పాన్‌ లింక్‌ అయి ఉంటే, ఆధార్‌ కార్డ్‌ నంబర్ చూపిస్తుంది. ఒకవేళ కాకపోయి ఉంటే ‘Link Aadhaar Status’ అని వస్తుంది.
    • ఒకవేళ ఆధార్‌-పాన్‌ లికింగ్‌ ప్రాసెస్‌లో ఉంటే check the status later అని చూపిస్తుంది.

    SMS ద్వారా

    SMS ద్వారా కూడా ఆధార్‌-పాన్‌ లింకింగ్‌ స్టేటస్‌ను తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం UID PAN → SPACE → 12 digit Aadhaar →Space →10 digit PAN number ఎంటర్‌ చేసి 567678 లేదా 56161కు SMS చేయాలి. ఆధార్‌ పాన్ లింక్‌ అయ్యి ఉంటే “Aadhaar is already associated with PAN in ITD database. Thank you for using our services” అని లేకపోతే,  “Aadhaar is not associated with PAN (number) in ITD database. Thank you for using our services” అని సమాధానం వస్తుంది. 

    ఆధార్‌ పాన్‌ లింక్ కోసం ఫీజు ఎలా చెల్లించాలి?

    ఆధార్‌-పాన్ లింకింగ్‌ కోసం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అనేక బ్యాంకులకు ప్రభుత్వం ఆథరైజేషన్ ఇచ్చింది. 

    • e-ఫైలింగ్‌ హోం పేజ్‌కు వెళ్లి లింక్‌ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి. లేదా e-ఫైలింగ్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి లింక్‌ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి. 
    • పన్నుదారుడు పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, OTP కోసం మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి
    • ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత e-pay ట్యాక్స్‌ పేజ్‌కు రీడైరెక్ట్‌ అవుతుంది. 
    • ప్రోసీడ్‌పై క్లిక్‌ చేయాలి.
    • AY 2023-24 సెలెక్ట్‌ చేసుకుని other Receipts (500)ను పేమెంట్‌ ఆప్షన్‌గా ఎంచుకుని కంటిన్యూ నొక్కాలి.
    • రూ.1000 అమౌంట్‌ ముందుగానే సెలెక్ట్‌ అయ్యి ఉంటుంది. కంటిన్యూ నొక్కాలి.
    • ఇప్పుడు చలాన్‌ వస్తుంది. ఆ తర్వాత పేమెంట్ విధానాన్ని ఎంచుకుని చెల్లింపు చేయాలి. 

    ఈ విధంగా ఆధార్‌-పాన్ లింక్‌ ప్రాసెస్‌ పూర్తి చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv