కోలీవుడ్ నటి అనిఖా విక్రమన్‌పై తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై దాడి చేశాడు. ఈ దాడిలో అనిఖా తీవ్రంగా గాయపడింది. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను అనిఖా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. శరీరమంతా గాయాలతో ముఖం, కళ్లు కందిపోయి ఉన్నాయి. ‘‘గతంలో అనూప్‌తో రిలేషన్‌లో ఉన్నాను. అతడు నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఇప్పటికీ నన్ను వేధిస్తున్నాడు. నాపై దారుణంగా దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశా.’’ అంటూ అనిఖా వాపోయింది.
-
Courtesy Twitter: Muhammad Azam
-
Screengrab Instagram: anickavikhraman