టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.
ముఖ్యంగా ఏమోషనల్ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.
శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్ కేసరి ద్వారా నటనకు స్కోప్ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.
ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.
కిస్ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘భరాతే’ అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.
ఇక 2021లో వచ్చిన ‘పెళ్లి సందD’ చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది.
గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.
ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.