ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఔత్సాహికులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తమలోని సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. టీమిండియా క్రికెటర్లను సరికొత్త లుక్‌లో చూపించాడు. భారతీయ స్టార్ క్రికెటర్లను పసిపిల్లలుగా మార్చడానికి AIని ఉపయోగిండు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లతో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చబ్బీ చెంపలతో క్యూట్‌గా ఉన్న విరాట్ కోహ్లీని ఇక్కడ చూడవచ్చు
సీరియస్ లుక్‌లో ఉన్న MS ధోనిని ఏఐ ఈవిధంగా ఊహించింది..
అమాయకంగా ఉన్న లుక్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
రవింద్ర జడేజాను చూడండి చిన్నప్పుడే మీసాలు వచ్చేశాయి.
స్మైలింగ్ లుక్‌లో ఉన్న జాస్ప్రిత్ బుమ్రా
చెవి పోగులతో ఇన్నోసెంట్‌గా ఉన్న కేఎల్ రాహుల్
ఆశ్చర్యంగా చూస్తున్న పొజులో శ్రేయస్ అయ్యర్
సంజూ శ్యాంసన్‌ను చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో..