నిర్మాత దిల్ రాజుపై తమిళ్ హీరో అజిత్ [ఫ్యాన్స్](url) గరమవుతున్నారు. తమిళంలో నెంబర్‌వన్ హీరో ఎవరో దిల్ రాజు ఎలా చెబుతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘‘దిల్‌రాజు నీకు థియేటర్లు కావాలంటే ఉదయనిధి స్టాలిన్‌ను అడుక్కో.. అంతే కానీ నెంబర్‌వన్ స్థానం గురించి మాట్లాడటానికి నువ్వెవరు?’’ అంటూ మండిపడుతున్నారు. ప్లేసుల గురించి మాట్లాడుతున్నారు..ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు అని విమర్శిస్తు న్నారు. కాగా తమిళంలో విజయ్ నెంబర్‌వన్ హీరో అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.