నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన RRR సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు బాలీవుడ్ అగ్ర నటులు కూడ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. అలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల పాత్రలకు ఈ మూవీలో నిడివి తక్కువే ఉన్నప్పటికీ ఆకట్టుకునే నటన చేశారట.
ప్రధానంగా అలియా భట్ సీత పాత్రలో ఒదిగిపోయారట. ఈమె రామ్ చరణ్‌కి జోడిగా పోటాపోటీ తన అభినయంతో ఆకట్టుకున్నారంటూ సినీ విమర్శకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కొన్ని సీన్లలో ఆమె చేసిన ఎమోషనల్ సీన్స్ అందరినీ భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ మూవీలో అలియా కేవలం 20 నిమిషాల పాటే కనిపించనున్నారట. కాని ఈమె ఈ పాత్రలో నటించేందుకు రూ.5 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. బాలీవుడ్‌లో ఫుల్ లెంగ్త్ మూవీలో నటిస్తేనే రూ.9 కోట్లు తీసుకునే ఈ భామ ఈ మూవీలో చిన్న పాత్రకు ఎక్కువ పారితోషికం తీసుకోవడం గమనార్హం. RRR చిత్రంలో హాలీవుడ్ నటులు ఓలివా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీస్‌సేన్ లు కూడ నటించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!