• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aloe Vera Acne Treatment: చలికాలంలో మొటిమలను తగ్గించే 5 సహజ మిశ్రమాలు ఇవే!

    అలోవెరా మొక్కను చర్మ సంరక్షణలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని జెల్‌ రూపంలో ఉండే జిగటు పదార్థానికి మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటీవల కాలంలో మొటిమలను కంట్రోల్ చేసే అనేక సౌందర్య సాధనాలలో అలోవెరాను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని సహజ ఔషధ గుణాలు ముఖంపై మండే లక్షణాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా  అద్భుతమైనవి. అలోవెరాతోపాటు మొటిమలను కంట్రోల్ చేసే ఇతర పదార్థాలను ఉపయోగించినప్పుడు.. ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి మొటిమలను తగ్గించే ఆ సహజ మిశ్రమాలను ఎలా తయారు చేసి వాడాలో ఇప్పుడు చూద్దాం..

    1. అలోవెరా & తేనె మిశ్రమం:

    తేనె యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఈ రెండింటి మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అద్దితే మంచి ఫలితం కనబడుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసేందుకు..  ముందుగా 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌ను, 2 టేబుల్‌ స్పూన్ల తేనెలో కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. తర్వాత దానికి 1/4 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

    విధానం:

    ఇలా చేసిన పేస్ట్‌ను మొటిమలు ఉన్న ముఖానికి మాస్క్‌లా అప్లై చేసుకోని 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోని ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. అలా వారానికి రెండు మూడు సార్లు వాడితే ప్రయోజనం ఉంటుంది.

    2. పసుపు &అలోవెరా పేస్ట్

    పసుపు మంచి యాంటీ బాక్టిరీయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని అలోవెరా మిశ్రమంతో కలిపి ఉపయోగించినప్పుడు మొటిమలను అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసేందుకు ముందుగా.. 1 టీస్పూన్ అలోవెరా మిశ్రమంలో  1టేబుల్ స్పూన్ శనగపిండిని బాగా కలిపి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. దీనికి  1/2 టీస్పూన్ పసుపు కొమ్ముల నుంచి తీసిన గంధాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి.

    విధానం:

    పేస్ట్‌లాగా చేసుకున్న మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ముఖాన్ని అలాగే వదిలేసిన చల్లని లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    3.నిమ్మరసం &అలోవెరా 

    అలోవెరాను నిమ్మరసంతో కలిపి వాడినప్పుడు మొటిమలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరాకు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మిశ్రమం తయారు చేసేందుకు…  2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌లో 1/4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి మృదవైన పేస్ట్‌గా తయారు చేసుకోవాలి.

    విధానం:

    ఇప్పుడు ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న చోట అద్దుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకునేటప్పుడు కొంచెం మండుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

    4.బాదం &అలోవెరా

    బాదం పప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇందులోని విటమిన్ E చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక బాదంను అలోవెరా జెల్‌తో కలిపి వాడినప్పుడు.. మొటిమలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ మిశ్రమం తయారీకి… 2 టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్, రెండు నీటిలో నానబెట్టిన బాదం గింజలను తీసుకోవాలి. ఈ అలోవెరా జెల్‌లో మెత్తగా చేసుకున్న బాదం పెస్ట్‌ను కలపాలి.

    విధానం:

    ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానిక ఓసారి చేసుకుంటే మొటిమల్ కంట్రోల్ అవుతాయి.

    5.పాలు, చక్కెర, అలోవెరా

    ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో చక్కెర నేచురల్ స్కర్బర్‌గా పనిచేస్తుంది. అలాగే ముఖంపై ఉన్న జిడ్డును ఇది తొలగిస్తుంది. చక్కెరను అలోవెరాతో కలిపి వాడినప్పుడు మొటిమలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రక్రియలో పాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో దోహదపడుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసేందుకు అరకప్పు పాలలో అరకప్పు చక్కెర వేసుకుని చిక్కని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీనికి 1/4 కప్పు అలోవెరా జెల్‌ను కలుపుకుని పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. 

    విధానం:

    ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖంపై రౌండ్‌గా వచ్చే విధంగా సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి ఈ పేస్ట్‌ను మాస్క్‌లాగా వేసుకుంటే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv