తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’ (Razakar). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా యంగ్ బ్యూటీ ‘అనుశ్రియా త్రిపాఠి’ (Annusriya Tripathi) మంచి గుర్తింపు పొందింది.
నిజాం భార్య అజ్మా ఉన్నీసా పాత్రలో నటించి ఆమె తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఆ పాత్రలో ఈ భామ అందం చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూపీలోని అయోధ్యలో 1999లో పుట్టిన ఈ భామ.. బెంగళూరు డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి పెంచుకుంది.
కాలేజీ పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ కావాలని అనుశ్రియ తండ్రి సూచించారు. దీంతో మూడేళ్ల పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయిన ఈ భామ.. నటి కావాలన్న కోరికతో ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.
కెరీర్ ప్రారంభంలో మెుదట మోడలింగ్‌గా అనుశ్రియా వర్క్ చేసింది. 2018లో చత్తీస్‌ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
‘రజాకార్’లో పాత్ర కోసం తానే స్వయంగా దర్శకుడు యాట సత్యనారాయణను సంప్రదించినట్లు అనుశ్రియా తెలిపింది. ఆడిషన్స్‌లో పాల్గొని యూనిట్ మెప్పించినట్లు పేర్కొంది.
నిజాం భార్య పాత్ర గురించి తొలుత సవాల్‌గా అనిపించిందట. కథలో ఉన్న గ్లామర్ రోల్ తనదే కావడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.
బలమైన కథా నేపథ్యం ఉన్న ‘రజాకార్’ చిత్రంతో తన సినీ కెరీర్ ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అనుశ్రియా చెప్పింది. ఆ పాత్రతో తన కెరీర్ మెుదలై తన కల నెరవేర్చిందని పేర్కొంది.
‘రజాకార్’ తనకో మంచి అవకాశమని అనుశ్రియా తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు, యాక్టింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నట్లు పేర్కొంది.
ఇక ఇష్టమైన హీరోల విషయానికి వస్తే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో ‘రణ్‌బీర్ కపూర్’ (Ranbir Kapoor).. టాలీవుడ్‌లో ‘రామ్‌చరణ్’ (Ramcharan) అంటే చాలా ఇష్టమట. వారి నటనకు వీరాభిమానినని అనుశ్రియా తెలిపింది.
హీరోయిన్స్‌లలో ‘అనుష్క శెట్టి’ (Anushka Shetty), కీర్తి సురేష్ (keerthi Suresh) అంటే చాలా ఇష్టమట. మహానటిలో కీర్తి నటన చూసి తాను ఫిదా అయినట్లు అనుశ్రియా తెలిపింది.
మంచి కథయితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ భామ చెప్పింది. ఫేవరేట్ నటీనటులతో కలిసి పనిచేస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని పేర్కొంది.
అటు ఈ బ్యూటీకి నగలు, చీరలతో ఫొటో షూటింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఫోటోలను ఇన్‌స్టాలోనూ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. గ్లామర్ ఫొటోలతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్