టెన్నిస్ భామ ‘అరినా సబలెంక’ (Aryna Sabalenka) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. #ArynaSabalenka హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
తాజాగా ఆస్టేలియా ఓపెన్ (Australia Open) మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఈ బెలారస్ భామ (Aryna Sabalenka) ఎగరేసుకొని పోవడమే ఇందుకు కారణం.
గత సీజన్‌లో లాగే ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించిన అరినా సబలెంక ప్రత్యర్థులను చిత్తుచేసి మరి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో చైనాకు చెందిన కిన్వెన్ జెంగ్‌పై 6-3, 6-2 తేడాతో ఆమె విజయం సాధించడంతో సబలెంక (#ArynaSabalenka) పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది.
వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకోవడంతో సబలెంకా (Aryna Sabalenka) టెన్నిస్ రంగంలో ఇప్పుడో సంచలనంగా మారింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నాయి.
టెన్నిస్‌లోనే కాకుండా గ్లామర్ స్టార్‌గానూ సబలెంకకు (#ArynaSabalenka) పేరుంది. ఆమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తుంటుంది.
సబలెంక వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 1998 మే 5న జన్మించింది. 2015లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది.
గతేడాది (2023) ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా సబలెంక (#ArynaSabalenka) నిలవడంతో ఆమె పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.
5’11” అడుగుల ఎత్తు ఉండే ఈ బెలారస్ అథ్లెట్.. టెన్నిస్ కోర్టుతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అరినా సబలెంకకు ఓ అలవాటు ఉంది. ఆమె (Aryna Sabalenka) ప్రతీ మ్యాచ్ అనంతరం అభిమానులతో సెల్ఫీ దిగుతుంటారు. ఇది కెరీర్ ప్రారంభం నుంచి కొనసాగుతూ వస్తోందని ఆమె సన్నిహితులు తెలిపారు.
టెన్నిస్ కోర్టులో ఆటతో అదరగొట్టే సబలెంక.. డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. ఆమెలో ఓ మంచి డ్యాన్సర్ దాగుంది. ఇది పలు సందర్భాల్లో కూడా రుజువైంది.
ఆటలో భాగంగా వివిధ దేశాల్లో తిరిగే సబలెంకా.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అక్కడి పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంది. అక్కడ దిగిన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తుంది.
మరోవైపు ఫ్యాషన్ పైనా ఈ భామ (Aryna Sabalenka)కు మక్కువ ఎక్కువే. లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు బట్టలు ధరించి ఆమె అందర్ని ఆశ్చర్యపరుస్తుంటుంది.
ఇక ఫిట్‌నెస్ కోసం ఆమె తీవ్రంగా శ్రమిస్తుంది. జిమ్‌లో గంటల కొద్ది కసరత్తులు చేయడంతో పాటు టెన్నిస్ కోర్టులోనూ ఆమె చెమటలు చిందిస్తుంటుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్