• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?

    తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. సస్పెన్స్‌తో కూడిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సరిగ్గా అదే కోవాలోని కథను ఎంచుకున్నారు డైరెక్టర్ బాబా పీఆర్. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకుని పెద్ద సాహసమే చేశారు. రచ్చ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ సినిమాలో హీరోగా నటించాడు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే?

    ఓ రాజకీయ పార్టీ అధినేత వద్ద పనిచేస్తున్న శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్‌కు ఎమ్మెల్యే టికెట్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తాను కూడా పోటీచేయాలని ఆ పార్టీ అధినేత రాములన్నకు చెబుతాడు. రూ.50 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తానని చెబుతాడు. దీంతో తన మనుషులతో కలిసి శంకర్ ప్లాన్ వేస్తాడు. శంకర్ వేసిన స్కెచ్‌లో హీరో హీరోయిన్లు( సూర్య, విషికా కోటా) ఎలా ఇరుక్కుంటారు. రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన రూ.100కోట్లు ఎక్కడ దాచాడు? ఆ డబ్బును ఎవరు కొట్టెశారు. అసలు అష్టదిగ్బంధనం ప్లాన్ చేసింది ఏవరు? అనే ట్విస్ట్‌లు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

    సినిమా ఎలా ఉందంటే?

    “యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది.. ఈ యుద్ధం రాజ్యం కోసమే, రాణి కోసమో, అధికార కోసమో కాదు.. అహం కోసం. అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది” అనే డైలాగ్ ట్రైలర్‌లో వినిపిస్తుంది.  ఇదే డైలాగ్‌ను సినిమా మొత్తం కథలో చూపించాడు దర్శకుడు బాబా పి.ఆర్.  ఇగోతో ఓ వ్యక్తి చేసే పని ఎక్కడికి దారి తీస్తుంది? అనేది ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో కథ సాదా సీదా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచుతుంది.  సెకండాఫ్ వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చోట్ల సిల్లీ పాయింట్లు ఉన్నా  ఓవరాల్‌గా సినిమా బాగుందని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారి ఈ సినిమా నచ్చుతుంది.

    ఎవరెలా చేశారంటే?

    సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ప్రేష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరో భరత్ చంద్ర యాక్టింగ్ పర్వాలేదు. హీరోయిన్ విషికా కోటా… అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ నచ్చుతుంది. రౌడీ షీటర్ శంకర్ పాత్రలో నటించిన మహేష్ రావుల్ విలనిజాన్ని బాగా చూపించాడు. యాక్షన్ సీన్స్‌లో జీవించాడు. మిగతా పాత్రలు కూడా తమ క్యారెక్టర్ల పరిధిమేరకు నటించారు. 

    సాంకేతికంగా

    సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. జాక్సన్ విజయన్ మ్యూజిక్, సాంగ్స్, బీజీఎమ్ పర్వాలేదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాలోని కొన్ని సీన్లలో సత్య తన ఎడిటింగ్‌కు ఇంకాస్త మెరుగుపెడితే బాగుండేది.

    బలాలు

    థ్లిల్లర్ కథాంశం

    ఇంటర్వెల్ ట్విస్ట్

    విలన్ శంకర్ క్యారెక్టరైజేషన్

    బలహీనతలు

    కొన్నిచోట్ల లాజిక్ మిస్

    సిల్లీ సీన్స్

    చివరగా: థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలు కోరుకునే వారికి ఈ చిత్రం నచ్చుతుంది

    రేటింగ్: 3.5/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv