• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మళ్లీ పెళ్లి ట్రైలర్‌ ఎలా ఉందో చూసేయండి !

  ప్రముఖ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. నరేశ్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మే 26న చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించగా నరేశ్ స్వయంగా నిర్మించారు. సురేశ్ బొబ్బిలి, అరుల్ దేవ్‌ సంగీతం అందించారు.

  హీరోలా ఉంటాడనుకున్నా..చిన్నపిల్లాడు: సుధా మూర్తి

  ఇన్పోసిస్‌ చైర్‌ పర్సన్‌ సుధా మూర్తి తన భర్త నారాయణ మూర్తితో పరిచయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టాక్‌ షోలో నారాయణ మూర్తిని ఎలా కలిశారు అని అడగ్గా… “ నా స్నేహితురాలు ప్రసన్న ద్వారా పరిచయం అయ్యారు. ఆమె రోజుకో పుస్తకం తీసుకువచ్చేది. అందులో ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి ఇస్తాంబుల్, పెషావర్ అని పేర్లు ఉండేవి. నేను బస్ కండక్టర్ అనుకున్నా. ఒకరోజు ఆయన్ని కలిసేందుకు వెళ్లినప్పుడు హీరోలా ఉంటాడని ఊహించుకున్నా. డోర్ తీయగానే చిన్నపిల్లాడని అనిపించింది” అన్నారు.

  మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి

  ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో విషాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దిలీప్‌ రౌజ్కర్‌ అనే వ్యక్తి తన మేనకోడలి పెళ్లికి హాజరయ్యాడు. అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. છત્તીસગઢ: ભત્રીજીના લગ્નમાં માતમ છવાયો ડાન્સ કરી રહેલા કાકા હાર્ટ એટેકથી ઢળી પડ્યાં#Chhattisgarh … Read more

  అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌…కాళ్లుమెుక్కేశాడు !

  తమిళ్‌ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌ వుడ్స్‌ అనే సంస్థ అల్లు అర్జున్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో తన చిన్న నాటి టీచర్‌ను పిలిచారు. ఆమెను చూసిన అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. ఆమె కాళ్లకి నమస్కారం చేశారు. “ ఈ మేడం పేరు అంబికా. నాకు చాలా ఇష్టమైన టీచర్. నేను చాలా బ్యాడ్‌ స్టూడెంట్‌ని. క్లాస్‌లో 50 మంది ఉంటే 50వ ర్యాంకు వచ్చేది. అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. మార్కులు రాలేదని బాధపడొద్దు అని చెప్పేవారు. అందరూ … Read more

  కన్నీళ్లు పెట్టిస్తున్న మనోబాల చివరి వీడియో

  ప్రముఖ నటుడు మనోబాల చివరి రోజులకు సంబంధించిన వీడియో అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఆయన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో కుటుంబ సభ్యులు ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. తన నటనతో కడుపుబ్బా నవ్వించే మనోబాల.. వీడియోలో మాట్లాడలేని స్థితిలో కనిపించారు. ఆయన కుమారుడు మనోబాల కోసం పాట పాడటం అభిమానులను కన్నీరు పెట్టించింది. వేస్ట్‌ పేపర్ పేరిట ఈ దిగ్గజం యూట్యూబ్‌ ఛానల్ నడిపేవారు. రివ్యూలు, ఇంటర్వ్యూలు చేసేవారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఇటీవల కన్నుమూశారు.

  ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?

  ఛత్రపతి హిందీలో విడుదలవుతున్న వేళ దర్శకధీరుడు రాజమౌళి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. “ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మాస్‌ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ తెరకెక్కించడం సంతోషం. సినిమా కథ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సరిగ్గా సరిపోతుంది. అతడి బాడీ లాంగ్వెజ్‌కు సూట్ అయ్యే స్టోరి ఇది. చిత్రబృందం మెుత్తానికి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. జూన్‌ 12న సినిమా రిలీజ్ అవుతుంది. SS RAJAMOULI SENDS BEST WISHES TO TEAM … Read more

  ఎల్లో దుస్తుల్లో మెరిసిపోతున్న రాశీ ఖన్నా

  హీరోయిన్ రాశిఖన్నా పసుపురంగు దుస్తుల్లో మెరిసిపోయింది. ఓ యాడ్ షూట్‌లో భాగంగా ఈ అమ్మడు డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. నేలపై పడుకొని హొయలు ఒలకబోసింది సుందరి. అంతేకాదు, సరదాగా డాన్స్ చేస్తూ సందడి చేసింది ముద్దుగుమ్మ. రాశీ ఇటీవల ఫర్జీ వెబ్‌ సిరీస్‌తో హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధతో పాటు మరో రెండు తమిళ్ చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది బ్యూటీ. https://www.instagram.com/p/CsDH4Q1rW6w/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA== Screengrab Instagram:raashiikhanna Screengrab Instagram:raashiikhanna

  NBK 108లో బాలీవుడ్ నటుడు

  బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నాడు. అర్జున్‌ రాంపాల్‌కు వెల్‌కమ్ చెబుతూ చిత్రబృందం వీడియోను విడుదల చేశారు. ఇందులో ఫ్లూటు జింక ముందు ఊదూ సింహం ముందు కాదు అని బాలయ్య డైలాగ్ చెప్పాడు. బాలకృష్ణ, అనిల్‌తో కలిసి పనిచేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసిన రాంపాల్.. వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో శ్రీ లీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ర్యాపిడో డ్రైవర్

  హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారయత్నం నుంచి ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఎర్రిమంజిల్‌ వద్ద కస్టమర్ కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారి ఏడ్చినట్లు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు కనిపించింది. అతడిని ఆపి ఎవరని ప్రశ్నించగా బాలిక తండ్రినంటూ దబాయించే ప్రయత్నం చేశాడు. కానీ, అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనాస్థలికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను సురక్షితంగా తల్లికి అప్పగించారు. Hear Kalyan narrate the incident & how he was … Read more

  విడాకుల విషయం ఇకనైనా వదిలేయండి: చైతన్య

  సమంతతో విడాకుల విషయాన్ని ఇంకా హైలైట్ చేస్తుండటంపై నాగ చైతన్య అసహనం వ్యక్తం చేశాడు. “ నా సినిమాల గురించి ఎన్ని మాట్లాడిన ఓకే. కానీ, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాధపడతాను. కేవలం హెడ్‌లైన్స్‌ కోసం ఇలా చేయడం బాధాకరం. దురదృష్టవశాత్తు మేం విడిపోయాం. కానీ, ఆ దశ అంటే నాకు గౌరవం ఉంది. మాకు కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అయ్యింది. ఇంకా అదే విషయాన్ని సాగదీస్తున్నారు. సంబంధం లేని మూడో వ్యక్తిని లాగుతున్నారు. ఇకనైనా వదిలేస్తారని ఆశిస్తున్నా” అన్నాడు. … Read more