పలు పెద్ద సినిమాల వాయిదాతో జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంగార్రాజుకు.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. కరోనా సమయంలో కూడా సినిమాను వాయిదా వేయకుండా సంక్రాంతి బరిలోకి పక్కాగా విడుదల చేశారు. పంచెకట్టులో నాగార్జున-నాగచైతన్య లుక్స్, డైలాగ్స్ కూడా సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలో సంక్రాంతి పోరులో ఈ మూవీ నిలిచిందా? అసలు కథేంటో ఇప్పుడు చుద్దాం.
ఇక కథలోకి వెళ్తే బంగార్రాజు సోగ్గాడే చిన్ని నాయన ముగించిన చోటు నుంచే మొదలవుతుంది. బంగార్రాజు(నాగార్జున)కు స్వర్గలోక ప్రాప్తి కల్గుతుంది. ఆ తర్వాత అక్కడకు భార్య సత్యభామ(రమ్యకృష్ణ) కూడా చేరుకుంటుంది. కానీ వారి కుమారుడు అతని వారసత్వాన్ని చిన బంగార్రాజు (నాగ చైతన్య) ఎలా నిర్వహిస్తాడోనని సత్యభామ బెంగ పెట్టుకుంటుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి చిన బంగార్రాజు చేష్టలు చూస్తూ ఉంటుంది. ఈ తరుణంలో అదే గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి (కృతి శెట్టి)తో తనకు వివాహం జరిపించాలని అనుకుంటారు. అయితే వీరి మధ్య అప్పుడప్పుడు చిలిపి గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో చిన బంగార్రాజుకు ప్రాణ హాని ఉందని తెలిసి బంగార్రాజు ఎంట్రీ ఇస్తాడు. ఈ నేపథ్యంలో తనను కాపాడేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశాడు. కృతి శెట్టి, నాగచైతన్య మధ్య ప్రేమ ఎలా పుట్టించాడు. ఆ గ్రామంలో ఉన్న గుడి సమస్యను ఎలా సాల్వ్ చేశాడు. చిన బంగార్రాజు ప్రాబ్లమ్స్‌ను బంగార్రాజు ఆత్మ ఎలా సాల్వ్ చేశాడనేదే అసలు స్టోరీ.
శివపురం గ్రామానికి చెందిన ప్లే బాయ్ చిన బంగార్రాజు (నాగ చైతన్య). తన మాస్ లుక్స్, యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గోదావరి స్లాంగ్లో డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసిన నాగ చైతన్యకు ఈ మూవీ పర్ఫెక్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.
ఇక బంగార్రాజు(నాగార్జున) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. పంచె కట్టులో నాగ్ లుక్స్ అదుర్స్. తనదైన శైలిలో డైలాగ్స్, ఫైట్స్ చేస్తూ అలరించాడు. గత సినిమాకు ధీటుగా నటించి అదుర్స్ అనిపించాడు.
మరోవైపు సత్యభామ(రమ్యకృష్ణ) తనదైన యాస డైలాగ్స్ తో అదరగొట్టింది. బంగార్రాజుకు సపోర్టుగా తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు. తన హావభావాలతో అదరగొట్టింది. సినిమాకు తగిన విధంగా తన మేనరిజంతో డైలాగ్స్ చెప్పి, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది.
ఇక నాగలక్ష్మి(కృతిశెట్టి) కూడా తన క్యారెక్టర్లో లీనమైంది. చైతూతో కలిసి రొమాంటిక్, పలు ఫన్నీ సీన్లను కూడా పండించింది. తన గ్లామర్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. దీనికి తగ్గుట్టుగా నాగలక్ష్మి తండ్రి పాత్రలో రావురమేష్, వెన్నెల కిషోర్ పాత్ర కూడా పరవాలేదనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. మొత్తంగా రొమాన్స్, కామెడీ కథకు యాక్షన్ యాడ్ చేసి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కానీ…
పెద్దగా ట్విస్టులు లేకపోవడం. స్టోరీ నార్మల్‌గా కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా విజువల్స్, బడ్జెట్, కొన్ని లాజిక్స్ మిస్సయినట్లు ఫీలవడం ఖాయం.