ఈ ప్రపంచం ఎంతో అంద మైనది. ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, ప్రాంతాలకు నెలవు. అలాగే వందలాది దేశాలు, వేలాది నగరాలను ఈ భూమి కలిగి ఉంది. అయితే వాటిలో కొన్ని సిటీలు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆయా నగరాల్లోని ప్రకృతి సోయగాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వాటిని వీక్షించిన పర్యాటకులు భూతల స్వర్గాన్ని చూసినట్లు భావిస్తారు. అంతేగాక జీవితంలో కనీసం ఒకసారైన వాటిని చూడాలని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సూచిస్తారు. మరి అటువంటి నగరాలు ఏవి? ఏ దేశంలో ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటీ? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
1. పారిస్ (Paris)
ప్రపంచంలోని అత్యంత సుందరమైన నగరం అనగానే ముందుగా పారిస్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈ నగరం ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఇక్కడ ఈఫిల్ టవర్‌తో పాటు కేఫ్స్, బుక్ షాప్స్, ఆర్ట్సీ రీజియన్స్, మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. పెళ్లైన జంటలు తమ హనీమూన్ కోసం పారిస్ నగరానికే ఎక్కువగా వెళ్తుంటారు.
2. హకోన్ (Hakone)
హకోన్ నగరం జపాన్‌లో ఉంది. షింటో మందిరాలకు ఈ నగరం పెట్టింది పేరు. ఎంతో అందమైన పర్వతాల మధ్యలో హకోన్ ఉంది. ప్రసిద్ద మౌంట్ ఫ్యూజీ పర్వతపు అందాలు ఈ నగరానికి మరింత గుర్తింపును తీసుకొచ్చాయి.
3. మతేరా (Matera)
పురాతన అద్భుత అందాలను కలిగిన దేశాల్లో ఇటలీ మూడవ స్థానంలో ఉంది. అటువంటి ఇటలీలోనే ఈ సుందరమైన మతేరా నగరం ఉంది. ఈ ప్రాంతం హాలీవుడ్ చిత్రాలకు ఎంతో ఫేమస్. ఇక్కడ వందలాది ఇంగ్లీష్ చిత్రాలను షూట్ చేశారు.
4. బుడాపెస్ట్ (Budapest)
హంగేరీ దేశంలో ఉండే బుడాపెస్ట్ ఎంతో అందమైన సిటీ. ఇక్కడి ప్రాంతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. బుడాపెస్ట్ ఆర్కిటెక్చర్‌ను చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతుంటారు. అందుకే విదేశీ పర్యటనకు వెళ్లాలని కోరుకునేవారు తమ లిస్ట్‌లో బుడాపెస్ట్‌ను కూడా చేర్చుకోవచ్చు.
5. ప్రెగ్ (Prague)
బరోక్ బిల్డింగ్స్, సిటీ స్క్వేర్స్, ప్రఖ్యాత చార్లెస్ బ్రిడ్జ్ ఇవన్ని కలిపి ఉన్న ఒకే ఒక్క ప్రాంతం ప్రెగ్ నగరం. చెక్‌రిపబ్లిక్ దేశంలోని ఈ సిటీ.. అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్‌కు పెట్టింది పేరు. ఒక్కసారి ఈ నగరంలో పర్యటిస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు.
6. రోమ్ (Rome)
రోమ్‌లోని ల్యాండ్ మార్ల్క్ ప్రాంతం ఇప్పటికే ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ఈ నగరాన్ని చూస్తే ఎవరో మ్యాజిక్ చేసి నిర్మించినట్లు అనిపిస్తుంది. రోమ్‌ను చూసిన పర్యాటకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.
7. శ్రీనగర్ (SriNagar)
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతం భారత్‌లోని అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒకటి. హిమాలయాల పాదాల చెంత ఉన్న శ్రీనగర్‌ను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న అందమైన సరస్సులను చూసి మైమరిచిపోతుంటారు.
8. వెనిస్ (Venis)
ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల జాబితాలో వెనిస్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడి ప్రకాశవంతమైన బిల్డ్సింగ్స్, పురాతన కాలంనాటి కోటలు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తాయి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి