సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కారు, బస్సు, రైలు, విమానాలను ప్రజలు ఆశ్రయిస్తారు. మరికొందరు నౌక ప్రయాణాన్ని ఆప్షన్‌గా తీసుకుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా రైలు ప్రయాణానికి ప్రత్యేక స్థానముంది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. ప్రకృతి సోయగాల మధ్య సాగే రైలు ప్రయాణం అహ్లాదాన్ని ఇస్తుంది. ప్రయాణికుల్లో మధురానుభూతులను పంచుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 10 అత్యాధ్బుతమైన రైలు మార్గాలు మీకోసం…
1. వాస్కోడిగామా To లోండా
గోవాలోని వాస్కోడిగామా నుంచి కర్ణాటకలోని లోండా వరకూ ఉన్న రైలు మార్గం దేశంలోనే అత్యుత్తమైంది. పశ్చిమ కనుముల గుండా సాగే ఈ రైలుప్రయాణం ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ మార్గంలో దట్టమైన అడవి పలకరిస్తుంది. జలపాతాలు ప్రయాణికులను మైమరిచేలా చేస్తాయి. మలుపులు తీసుకుంటూ సాగే ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేరు.
2. మండపం To రామేశ్వరం
తమిళనాడులోని మండపం టౌన్ నుంచి రామేశ్వరం వరకూ చేసే రైలు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఈ మార్గంలోనే పంబన్ బ్రిడ్జ్ తగులుతుంది. దేశంలో సముద్రంపై నిర్మించిన తొలి వంతెన ఇదే. సముద్రం గుండా సాగే ఈ రైలు ప్రయాణం కచ్చితంగా ప్రయాణికులకు నచ్చుతుంది. ఈ జర్నీని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
3. జోధాపూర్ To జైసల్మేర్
రాజస్థాన్ రాజధాని జైసల్మేర్ నుంచి జోధాపూర్ వరకూ ఉన్న రైలు మార్గం విభిన్నమైన అనుభూతిని పరిచయం చేస్తుంది. థార్ ఎడారి గుండా సాగే ఈ ప్రయాణం మైమరిచిపోయేలా చేస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇసుక తిన్నెలపై నడిచే ఒంటెలు దర్శనమిస్తాయి. ఎడారిలోని మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఏడారి సంస్కృతిని తెలియజేసే ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
4. డార్జిలింగ్ To న్యూ జల్పైగురి
బంగాల్‌లోని డార్జిలింగ్ నుంచి జల్పైగురి ప్రాంతం మధ్య చేసే రైలు ప్రయాణం ఎంతో గొప్పగా నిలుస్తుంది. ఈ మార్గం పర్వత ప్రాంతాలు, పచ్చని అడవులు, కొండ మలుపులు, టీ తోటలతో నిండి ఉంటుంది. దేశంలోని అతిపురాతన రైలుమార్గాల్లో ఒకటిగా దీన్ని పిలుస్తారు. ఈ మార్గాన్ని 1999లో యూనెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
5. ఉదకమండలం To మెట్టుపాళ్యం
తమిళనాడులోని ఉదకమండలం నుంచి మెట్టుపాళ్యం వరకూ రైలు ప్రయాణం భూతల స్వర్గాన్ని పరిచయం చేస్తుంది. నీలగిరి పర్వత సానువుల గుండా సాగే ఈ మార్గం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణాన్ని ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఇష్టపడతారు. నీలగిరి మౌంటైన్ రైల్వే 110 సంవత్సరాలుగా ఈ మార్గంలో ట్రైన్ నడుపుతోంది.
6. రాజస్థాన్ To దిల్లీ
రాజస్థాన్ నుంచి దిల్లీకి రైలు ప్రయాణం ఎడారి రాష్ట్రంలోని అనేక అందమైన నగరాలను పరిచయం చేస్తుంది. జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, సవాయి మాధోపుర్, చిత్తోగఢ్, ఉదయ్‌పుర్, బికనీర్, ఆగ్రాల గుండా ఈ ప్రయాణం సాగుతుంది. ఒక్క జర్నీలో రాజస్థాన్ ముఖ్యమైన పట్టణాలు, ప్రాంతాలను చూడటం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
7. దిల్లీ To లెడో
దేశ రాజధాని దిల్లీ నుంచి అసోంలోని లెడో వరకు రైలు ప్రయాణం కూడా గొప్ప అనుభూతినే పంచుతుంది. ఈ జర్నీలో పచ్చటి పొలాలు, టీ-కాఫీ తోటలు, అద్భుతమైన ప్రకృతిసోయగాలు తారసపడతాయి. వాటిని చూడలంటే దిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణించాలి.
8. మడ్గావ్ To ముంబయి
గోవాలోని మడ్గావ్ నుంచి ముంబయి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. నదులు, పర్వతాలు, పచ్చదనం ప్రయాణికులను మైమరిచిపోయేలా చేస్తాయి. ఎత్తైన పర్వతాలు, లోయలు విభిన్న అనుభూతిని పంచుతాయి.
9. కన్యాకుమారి To తిరువనంతపురం
తమిళనాడులో కన్యాకుమారి-తిరువనంతపురం మార్గం దేశంలోని పూరాతన రైలు మార్గాల్లో ఒకటి. రెండు గంటల పాటు సాగే ఈ జర్నీని ప్రయాణికులు జీవితంలో మర్చిపోలేరు. కొబ్బరి తోటలు, నీటి వనరులు, అద్భుతమైన గ్రామాలు ప్రయాణికులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి.
10. ముంబయి To దిల్లీ
ముంబయి నుంచి దిల్లీ మార్గం కూడా ఎన్నో మధురానుభూతులను పంచుకుంది. ఈ మార్గంలో ప్రయాణించేందుకు డెక్కన్ ఒడెస్సీ రైలు చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ రైలు వడోదర, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, ఆగ్రా, సవాయి, మాధోపూర్, జైపూర్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తూ వెళ్తుంది. ముఖ్యంగా రణతంభోర్ అభయారణ్యంలో ఈ రైలు ప్రయాణం ఆకట్టుకుంటుంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి