• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bgauss E-Scooter Review: రూ.99,999కే సరికొత్త ఈ-స్కూటర్‌.. ఫీచర్స్‌ చూస్తే కెవ్వు కేక అనాల్సిందే..!

    భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవడంతో కొత్తగా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేవారు ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థలు సరికొత్త ఈ – స్కూటీలను మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగాస్ కంపెనీ (Bgauss Company) BG C12i EX ప్రీమియం స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సిటీ పరిధిలో తిరిగేవారికి ఈ స్కూటర్‌ సరిగ్గా సరిపోతుందని చెబుతోంది. మరి ఈ నయా స్కూటర్‌ లుక్‌, ఫీచర్స్‌, ధర, డిజైన్‌ ఎలా ఉందో ఒక లుకేద్దాం. 

    డిజిటల్‌ మీటర్‌

    ఈ స్కూటర్‌ డిజిటల్‌ మీటర్‌ను ఫ్యూచరిస్టిక్‌ డాష్‌బోర్డ్‌ డిజైన్‌తో తీసుకొచ్చారు. ఇందులో డిస్టెన్స్, స్పీడ్ వంటి వివరాలు చూసుకోవచ్చు. స్కూటర్‌కి మల్టిపుల్ సేఫ్టీ లేయర్స్ ఉన్నాయి. 20+ బ్యాటరీ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ జర్నీకి ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు.

    స్కూటీ స్పీడ్‌

    BG C12i EX స్కూటర్‌కి 2.5kwh మోటర్ ఉంది. ఇది 105 nm పీక్ టార్క్ ఇస్తుంది. దీని సాయంతో గరిష్టంగా గంటకు 60 Kmph వేగంతో ప్రయాణించవచ్చు. 

    బ్యాటరీ సామర్థ్యం

    BG C12i EX స్కూటర్‌లో 2.0kwh లిథియం అయాన్ బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీన్ని అల్యూమినియం కేసింగ్‌తో తీసుకొచ్చారు. ఎయిర్-కూల్డ్ మేనేజ్‌మెంట్‌ను కూడా ఈ బ్యాటరీ కలిగి ఉంది. వాటర్‌ & డస్ట్‌ ప్రూఫ్‌ రెసిస్టెన్స్‌ను బ్యాటరీకి ఇచ్చారు. IP67 ratingతో దీన్ని రూపొందించారు.

    మైలేజ్‌ ఎంతంటే? 

    ఈ స్కూటర్ బ్యాటరీని ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే 85 కిలో మీటర్ల వరకూ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించవచ్చు. అంతేగాక బ్యాటరీని 3 గంటల్లోనే వంద శాతం ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    బ్యాటరీ సేవింగ్‌ మోడ్

    ఈ స్కూటర్‌కు ఇంటెలిజెంట్ బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను అందించారు. బ్యాటరీ ఛార్జ్ 10 శాతం కంటే తగ్గిపోయినప్పుడు ఈ సేవింగ్ మోడ్.. పవర్ సేవ్ అయ్యేలా చేస్తుంది. వేగాన్ని గంటకు 20 కిలోమీటర్లకు చేర్చి సేఫ్‌గా గమ్యానికి చేరుకునేలా చేస్తుంది.

    బూట్‌ స్పేస్‌

    ఈ స్కూటర్‌లో బూట్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారు. 23 లీటర్ల అండర్‌ సీటర్‌ స్టోరేజ్‌ (under seat storage) కారణంగా హెల్మెట్ సహా చాలా వస్తువుల్ని సీటు కింద భద్రపరుచుకోవచ్చు. 

    స్టైలిష్‌ లుక్‌

    BG C12i EX స్కూటర్‌ను స్టైలిష్ లుక్‌తో కంపెనీ తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌ కోసం క్రోమ్ హెడ్‌ల్యాంప్స్, LED ఇండికేటర్స్, LED హెడ్ లైట్స్‌ను స్కూటర్‌కు ఫిక్స్‌ చేశారు. 

    స్కూటీ కలర్స్

    ఇండియాలో తయారవుతున్న ఈ స్కూటర్‌లో 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బిగాస్ బ్లూ, ఫొల్లాజ్ గ్రీన్, ఎల్లో బ్లాక్, రెడ్ బ్లాక్, షైనీ సిల్వర్, పెర్ల్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    BG C12i EX స్కూటర్ ఎక్స్‌ షోరూమ్‌ ధరను కంపెనీ రూ.99,999గా నిర్ణయించింది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 19 వరకే అందుబాటులో ఉంటుందని చెప్పింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో C12i EX స్కూటీని బుక్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా దగ్గరలోని తమ కంపెనీ డీలర్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. ఈ స్కూటర్‌పై 5 సంవత్సరాల వారంటీతో పాటు EMI సౌకర్యాన్ని కూడా బిగాస్‌ కల్పించింది. రూ.6,197 డౌన్‌ పేమెంట్‌తో రూ. 2,437 నెల వారి EMI కింద చెల్లించి బైక్‌ పొందవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv