బుల్లితెర నటి ప్రియాంక జైన్ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. తాజాగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తనదైన ఆటతీరుతో వీక్షకులను అలరిస్తోంది. కేవలం ఆటతోనే కాకుండా తన అందం అభినయంతో మెప్పిస్తోంది. అయితే ప్రియాంక జైన్ సీరియల్స్‌లో నటిస్తుందన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కానీ ఆమె జీవితానికి సంబంధించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
మహారాష్ట్ర ముంబయికి చెందిన ఓ పేదింటి కుటుంబలో ప్రియాంక జైన్ జన్మించింది. అయతే, ఆమె విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే జరగడం విశేషం. ఎంతో కష్టపడి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.
ఈ మరాఠి భామ మొదట తమిళం, కన్నడలో సినిమాలు చేసింది. ‘రంగి తిరంగ (2015)’.. తమిళ్‌లో ఆమె చేసిన మెుదటి సినిమా. ఆ తర్వాత కన్నడలో గోలిసోడ (2016) సినిమాలో ఈ భామ నటించింది.
తెలుగులో కూడా ‘చల్తే చల్తే’ అనే ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రియాంక. కానీ సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ రాకపోవడంతో టెలివిజన్ బాట పట్టింది.
మొదట కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన ప్రియాంక జైన్.. క్రమంగా తెలుగు టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్స్‌లో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది.
వాటి ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది ప్రియాంక.
ప్రియాంకకు బాగా కావాల్సిన వారు ఆమెను ముద్దుగా ‘పియూ’ అని పిలుస్తారు. రాశిఫలాల విషయానికొస్తే ఆమెది కర్కాటక రాసి అని ప్రియాంక సన్నిహితుల ద్వారా తెలిసింది.
ఈ బుల్లితెర భామకు 2021 జులైలోనే వివాహమైంది. ఆమె భర్త పేరు శివకుమార్. ప్రియాంక నాన్న పేరు మనోజ్ ఎస్. జైన్. తల్లి ఫాల్గుని జైన్ హౌస్ వైఫ్. ప్రియాంక జైన మతాన్ని ఆరాధిస్తోంది.
ప్రియాంకకు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్ కూడా బాగా చేయగలదు. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే కుటుంబంతో కలిసి ఏదోక టూర్‌కు వెళ్లిపోతుందట. ఆమె హాబీల్లో షాపింగ్ కూడా ఓ ముఖ్యమైన అంశంగా ఉంది.
ప్రియాంక ఫుల్ నాన్ వెజిటేరియన్. ఆమెకు డ్రైవింగ్ స్కిల్స్ కూడా బాగా ఉన్నాయట. అలాగే ఈ భామకు జంతువులంటే అమితమైన ఇష్టమట. శునకాలంటే ఈ బ్యూటీకి ప్రాణమట.
ఫుడ్ విషయానికి వస్తే ప్రియాంకకు పిజ్జా, బర్గర్, పానిపురి అంటే చాలా ఇష్టం. అలాగే ఈ భామకు బాగా నచ్చిన పర్యటక ప్రాంతం లండన్. ఫేవరేట్ కలర్ గ్రీన్.
బిగ్‌బాస్ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4 లక్షల 71వేల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!