సోషియో ఫాంటసీ సినిమాలకు తెలుగు వారు ఎప్పటి నుంచే పట్టం కడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ జానర్‌లో ఓ మంచి సినిమా పడలేదు. అయితే దర్శకుడు వశిష్ఠను నమ్మి సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో ఈ సోషియో ఫాంటసీని నిర్మించి హీరోగా చేశాడు కల్యాణ్ రామ్. కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు. మరి కల్యాణ్ రామ్ నమ్మకం ఫలించిందా? సినిమా అనుకున్న విజయాన్ని సాధించిందా?
కథేంటంటే:
ఏ మాత్రం కనికరం లేకుండా కనిపించిందంతా నాదే అని ఆక్రమించుకుంటూ పోయే త్రిగర్తల సామ్రాజ్యాధిపతి ‘బింబిసారుడు’. అనుకోకుండా ఓ ప్రమాదంలో భవిష్యత్, అంటే ప్రస్తుత కాలానికి వస్తాడు. మరి ఈ ఆధునిక పోకడల్లో ఎలా మనగలిగాడు. అసలు ఈ కాలంలోకి బింబిసారుడు ఎలా వచ్చాడు? అనేది కథ. ఈ మధ్యలో అనేక మలుపులతో డైరెక్టర్ వశిష్ఠ తన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.
ఎలా ఉంది?
సోషియో ఫాంటసీకి సైన్స్ ఫిక్షన్ మేలవించాలన్న దర్శకుడు వశిష్ఠ ఆలోచనను మెచ్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ అప్పట్లో సింగితం శ్రీనివాస్‌తో ‘ఆదిత్య 369’ ద్వారా బాలయ్య చేసిందే. అప్పుడు బాబాయ్ హిట్ కొడితే ఇప్పుడు అబ్బాయ్ హిట్ కొట్టాడు. గత, వర్తమానాలను సమాంతరంగా నడిపిస్తూ, కథలో మలుపులతో దర్శకుడు వశిష్ఠ చివరిదాకా ప్రేక్షకుడిని కట్టిపడేశాడు. హీరోయిన్ల పాత్రలకు అంత ప్రాధాన్యత లేదు. కానీ కల్యాణ్ రామ్ అద్భుతమైన మేకోవర్‌తో చితక్కొట్టాడు. సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించినా మరీ అంత బోరింగ్‌గా అయితే ఉండదు. యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీనివాస్ రెడ్డికి మంచి రోల్ పడింది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగించేలా ఉన్నాయి. లాజిక్ మిస్ అవ్వకుండా వశిష్ఠ కథ రాసుకున్న తీరు బాగుంది. సమయోచితంగా పండించిన కామెడీ కూడా బాగానే పేలింది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
కల్యాణ్ రామ్ నటన
కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సాంకేతిక విలువలు
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం
సెకండాఫ్‌లో భావోద్వేగాలు ఇంకాస్త్ బలంగా ఉండాల్సింది
ఒక్కమాటలో
త్రిగర్తల రాజ్యాధిపతి థియేటర్లు బద్దలుకొట్టాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది