బాలివుడ్ బాక్సాఫీస్‌కు కోటి ఆశలనిస్తూ ఇవాళ విడుదలైన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాభ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.400కోట్ల ఈ భారీ బడ్జెట్‌తో సరికొత్త ‘అస్త్రలోకం’గా తీర్చిదిద్దిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. దక్షిణాన రాజమౌళి సమర్పణ బాధ్యతలు తీసుకున్నారు. మరి సినిమా అంచనాలు అందుకుందా? రివ్యూలో చూద్దాం
కథ:
బ్రహ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ అంతా బ్రహ్మాస్త్రను కాపాడే బ్రహ్మాన్ష్ అనే బృందం చుట్టూ తిరుగుతుంది. బ్రహ్మాస్త్ర మూడు ముక్కలుగా ఉంటుంది. వాటిని కలిపితే అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర రూపొందుతుంది. ఈ మూడు ముక్కల కోసం విలన్ల బృందం విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. వారిని బ్రహ్మాన్ష్ బృందం అడ్డుకుంటూ ఉంటుంది. అమితాభ్, నాగార్జున పాత్రలు ఏంటి? బ్రహ్మాన్ష్ బృందంలో ఎవరెవరు ఉంటారు? శివ పాత్ర చేసిన రణ్‌బీర్ కపూర్‌కు బ్రహ్మాస్త్రకు కనెక్షన్ ఏంటి? ఇవన్నీ తెరపై చూడాలి. సినిమాలో సర్‌ప్రైజ్‌గా బాలివుడ్ స్టార్ హీరో కూడా ఉన్నాడు.
ఎలా ఉంది?
శివ, ఇషాల పరిచయం, ప్రేమతో సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా దాదాపుగా వారి ప్రేమ కథనే చూపించారు. శివ తొలిచూపులోనే ఇషాతో ప్రేమలో పడటం, ఆ తర్వాత తనకు అగ్నికి ఉన్న బంధాన్ని ఆమెకు వివరించడం, వారి మధ్య కెమిస్ట్రీతో సాగుతుంది. ఇంటర్వెల్ సమయం వచ్చే సరికి మనకు అస్త్రలోకాన్ని పరిచయం చేస్తారు. బ్రహ్మాస్త్ర ముక్కల కోసం మౌని రాయ్ వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్లాష్‌బ్యాక్‌లో శివ తల్లి పాత్రను పరిచయం చేస్తారు. కథ చాలా గొప్పగా ఉందని అనిపించదు గానీ విజువల్‌గా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం సాంకేతిక సిబ్బంది బాగానే కష్టపడ్డారు. హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి కొన్ని సీన్లు చూసినపుడు హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. నాగార్జున పాత్ర నిడివి తక్కువే అయినా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర అభిమానులకు ఊపునిస్తుంది. ఆలియా, రణ్‌బీర్ కెమిస్ట్రీ అదిరిపోయింది. అమితాభ్ బచ్చన్ నటన గురించి చెప్పాల్సిన పని లేదు. మౌనీ రాయ్ కూడా చాలా బాగా చేసింది. అయితే గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు అంతా బాగానే ఉన్నప్పటికీ ఎడిటింగ్, స్క్రీన్‌ప్లేపై దర్శకుడు అయాన్ ముఖర్జీ మరికాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఫస్టాఫ్ చాలా చాలా ఎక్కువ సేపు సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే భారీ బడ్జెట్ సినిమా కదా అని మార్వెల్ సినిమాల రేంజ్‌లో ఊహించుకుని భారీ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
బలాలు:
గ్రాఫిక్స్
సినిమాటోగ్రఫీ
రణ్‌బీర్, ఆలియా కెమిస్ట్రీ
పాటలు
బలహీనతలు:
కథనం
ఎడిటింగ్
చివరిగా అతి భారీ అంచనాలు లేకుంటే ‘అస్త్రలోకం’లోకి ఓసారి వెళ్లి రావొచ్చు…
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది