తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశ ప్రజల్లో తెలియని భావోద్వేగాన్ని నెలకొల్పింది. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైనికుల అకాల మరణాన్ని జాతిజనులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనలో మరణించిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ (Brigadier LS Lidder)పై భార్య, కుతూరు భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. యావత్ దేశాన్ని తట్టిలేపే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి.
లిద్దర్ భార్య ఏమన్నారంటే..
‘ఒక గొప్ప సైనికుడిగా, మంచి స్నేహితుడిగా వేలాది మంది అభిమానులను నా భర్త సొంతం చేసుకున్నారు. నేను సైనికుడి భార్యను. బాధను దాచుకోని నా భర్తకు ఘనమైన వీడ్కోలు పలకాల్సిన సందర్భం ఇది. నాకు, నా బిడ్డకు తాను లేని లోటు పూడ్చలేనిది..కాని దేశాన్ని అభిమానించే తనకు స్మైలీ సెండాఫ్ ఇవ్వాలి’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
కూతురు ఏమన్నారంటే..
‘చిన్నపటి నుంచి నాన్న గారాబంగా పెంచారు. తండ్రిగా కాకుండా స్నేహితుడిలా నాకు దిశానిర్దేశం చేశారు. తాను లేడన్న బాధ ఎప్పటికీ ఉంటుంది. కాని మా నాన్న మరణం యావత్ దేశానికి లోటు. అలాంటి గొప్ప సైనికుడికి ఘనమైన వీడ్కోలు పలకాలంటూ’ స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది.