• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?

    నటీనటులు : అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా సింగ్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రీరామ్‌ రెడ్డి, మహమ్మద్‌ అలీ, ముకేష్‌ కుమార్‌ తదితరులు

    డైరెక్టర్‌ : సామ్ ఆంటోన్‌

    సంగీతం : హిప్‌హాప్‌ తమీజా

    సినిమాటోగ్రఫీ : క్రిష్ణన్‌ వసంత్‌

    ఎడిటర్‌ : రూబెన్‌

    నిర్మాత : కే.ఈ. జ్ఞానవేల్‌ రాజా 

    విడుదల తేదీ : ఆగస్టు 2, 2024

    మెగా హీరో అల్లు శిరీష్‌ (Allu Sirish) చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం ‘బడ్డీ‘ (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj), ప్రిషా సింగ్‌ (Prisha Singh) హీరోయిన్లుగా చేశారు. శామ్‌ ఆంటోన్‌ (Sam Antone) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. అడ్వెంచర్‌, యాక్షన్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లు శిరీష్‌కు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ఆదిత్య రామ్‌ (అల్లు శిరిష్‌) పైలెట్‌గా చేస్తుంటాడు. వైజాగ్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్‌) అతడ్ని ప్రేమిస్తుంది. ఆదిత్య కూడా చూడకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. పల్లవి మెడికల్‌ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్‌ అవుతుంది. కోమాలోకి వెళ్తుంది. ఆ స్థితిలో ఆమె ఆత్మ ఒకప్పుడు ఆదిత్య గిఫ్ట్‌గా ఇచ్చిన టెడ్డీలోకి వెళ్తుంది. అలా ఆమె ఆత్మ టెడ్డీ ద్వారా ఆదిత్యను ఎలా కలిసింది? విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది? ఇందుకు ఆదిత్య, టెడ్డీ చేసిన పోరాటం ఏంటి? అసలు పల్లవి బాడీని విలన్‌ గ్యాంగ్‌ ఏం చేయాలని అనుకుంది? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్‌ అద్భుత నటన కనబరిచాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. నటుడిగా ఈ సినిమాలో గొప్ప పరిణితిని సాధించాడు. అటు గాయత్రి భరద్వాజ్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. స్క్రీన్‌పై కనిపించినంత సేపు ఆడియన్స్‌ను కనువింద్‌ చేసింది. విలన్‌గా అజ్మల్‌ అమీర్‌ ఆకట్టుకున్నాడు. అల్లు శిరీష్‌ను ఢీకొట్టే పాత్రలో అతడి నటన మెప్పిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌ ప్రిషా సింగ్‌ ఎయిర్‌ హోస్టెస్‌గా అలరించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు శామ్‌ ఆంటోన్‌ విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్ మధ్య లవ్‌ ట్రాక్‌ను చాలా అందంగా తెరకెక్కించారు. దూరంగా ఉంటూనే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. మూవీ మధ్యలో వచ్చే ‘కల్కి’, ‘జై బాలయ్య స్లోగన్స్‌’ ఆడియన్స్‌లో జోష్‌ను తీసుకొచ్చాయి. బడ్డీతో కలిసి అల్లు శిరీష్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్ మెప్పిస్తాయి. అయితే తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని రగిలించడంతో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. ముందే ప్రిడిక్ట్‌ చేసేలా సన్నివేశాలు ఉన్నాయి. అక్కడక్కడ వచ్చే అసందర్బమైన కామెడీ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. కీలకమైన క్లైమాక్స్‌లో అనవసరంగా హాస్యాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాలను పరిశీలిస్తే హిప్‌హాప్‌ తమీజా అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సాంగ్స్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. క్రిష్ణన్‌ వసంత్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటర్‌ రూబెన్‌ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా బెటర్‌ ఔట్‌పుట్‌ ఇచ్చుంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. నిర్మాణ విలువలు పర్వాలేదు. 

    ప్లస్‌ పాయింట్‌

    • అల్లు శిరీష్‌ నటన
    • లవ్‌ ట్రాక్‌
    • బడ్డీతో చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌

    మైనస్‌ పాయింట్స్

    • స్క్రీన్‌ప్లే
    • కొరవడిన క్యూరియాసిటీ 
    • కొన్ని బోరింగ్‌ సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv