దినేష్ కార్తీక్ ఫ్యాన్స్‌ను చితకొట్టిన మురళి విజయ్
ప్రముఖ క్రికెటర్ మురళి విజయ్.. భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఫ్యాన్స్‌ను చితకొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ త్రిచ్చి వారియర్స్ తరఫున విజయ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో డీకే ఫ్యాన్స్.. అతడిని చూసి DK DK అంటూ అరవసాగారు. దీంతో కోపానికి గురైన విజయ్.. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్స్‌లోకి వెళ్లి వాళ్లపై చేయి చేసుకున్నాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విజయ్‌ను తిరిగి గ్రౌండ్‌లోకి పంపించారు. కాగా మురళి విజయ్.. దినేష్ కార్తీక్ మొదటి భార్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.