తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్.
మెుగిలయ్యకు అండగా
బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న ఆయనకి కంటి చూపు మందగించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మెుగిలయ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు వేణు ఎల్దండికి ఫోన్ చేసి మెుగిలయ్య కంటి చూపు రావటానికి ఎంత ఖర్చైనా తానే భరిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని వేణు వారికి చెప్పినట్లు మెుగిలయ్య దంపతులు వెల్లడించారు.
విలన్‌కు సాయం
చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించిన విలన్ పొన్నాంబలమ్. ఆయనకి కూడా కిడ్నీలు పాడైపోతే చిరుకి మెసేజ్ చేశాడు. ఏదైనా సాయం చేయాలని కోరాడు. ఐదు నిమిషాల్లో ఫోన్ చేసిన మెగాస్టార్… చెన్నైలోని అపోలోకి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 40 లక్షలు చెల్లించాడు. ఈ విషయాన్ని పొన్నాంబలమ్ స్వయంగా పంచుకున్నారు.
కెమెరామెన్‌కు చేయూత
అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి సూపర్ స్టార్లతో పనిచేసిన కెమెరామెన్ దేవరాజ్. చిరంజీవితో నాగు, పులిబెబ్బులి వంటి సినిమాలు తీశాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు తెలుసుకున్న చిరు… దేవరాజ్‌ను ఇంటికి పిలిచి రూ. 5 లక్షలు ఇచ్చారు. అంతేకాదు, ఎప్పుడు అవసరం ఉన్నా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
దటీజ్ మెగాస్టార్
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులను ఆదుకున్నాడు చిరంజీవి. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయించారు. కొంతమంది నటులకు అపోలో ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించినట్లు చాలామంది చెప్పారు. ఏళ్ల తరబడి ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతున్నాడంటే ఇదే కారణమని నటులు చిరంజీవిని కొనియాడుతున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!