మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మరో అత్యున్నత పౌర పురస్కారం వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పద్మవిభూషణ్ (Padma Vibhushan 2024) అవార్డుకు చిరంజీవి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో భారత రత్న(bharat ratna) తర్వాత పద్మవిభూషణ్‌ను రెండో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అయితే చిరంజీవికి అవార్డు గురించి గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో ఇప్పటికే చిరంజీవి పేరు చేరిపోయినట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.
పురస్కారానికి కారణమిదే!
సినీ రంగానికి చిరు చేసిన సేవలతో పాటు కొవిడ్ కాలంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మోదీ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను చిరంజీవి ఆదుకున్నారు. నిత్యావసరాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. సామాన్య పౌరుల కోసం అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించి పలువురికి ప్రాణం పోశారు. వీటన్నింటిని గమనించిన కేంద్రం.. మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం (మెుదటిది భారతరత్న) ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా!
కాగా, ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరు ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మానవత్వం, గొప్ప మనసుకు కేంద్రం ఇస్తున్న కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
పొలిటికల్ వ్యూహాం ఉందా?
చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ మెుదలైంది. కేంద్రంలోని భాజపా కొన్ని ప్రయోజనాలను ఆశించే చిరుకు పద్మవిభూషణ్( Chiranjeevi Padma Vibhushan) ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చిరుకు పద్మవిభూషణ్ ప్రకటించి పొలిటికల్‌గా మరింత మైలేజ్ పెంచుకోవాలన్నది భాజపా వ్యూహామని అంటున్నారు. ఏపీలో చిరు సోదరుడు పవన్ ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. చిరుకి జాతీయ పురస్కారం ఇచ్చి తెలంగాణలోని మెగా ఫ్యాన్స్‌ను ఆకర్షించాలని భాజపా భావిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిరు బిజీ బిజీ..
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు. వారు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలిసింది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్