నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
మాటలు: హేమంత్
నిర్మాతలు: కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
విడుదల తేదీ: 19-07-2024
ప్రియదర్శి (Priyadarsi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’ (Darling Movie Review In Telugu). ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ‘డార్లింగ్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాఘవ్ (ప్రియ దర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్ అంటూ కలలు కంటాడు. అందుకోసం కష్టపడి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్‌గా సెటిల్ అవుతాడు. తండ్రి (మురళీధర్ గౌడ్) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వగా చివర క్షణంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో రాఘవ సూసైడ్‌కు రెడీ అవుతాడు. ఆ సమయంలోనే రాఘవకు ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. చూసిన కొద్ది నిమిషాలకే నచ్చేయడం, ఆ విషయం ఆమెకు చెప్పడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. అయితే ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని శోభనం రోజున రాఘవ్‌కు తెలుస్తుంది. దీని వల్ల రాఘవ్ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్ (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ) ఎవరు? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
రాఘవ పాత్రలో హాస్య నటుడు ప్రియదర్శి మరోమారు ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. కథానాయిక నభా నటేష్ విభిన్నైన కోణాలున్న పాత్రలో అదరగొట్టింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. కెరీర్ బెస్ట్ నటనతో మెప్పించింది. స్ప్లిట్ పాత్రల్లోని వేరియేషన్స్‌ను తనదైన నటనతో చక్కగా చూపించింది. నభా నటేష్, ప్రియదర్శి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి, అయితే నభా నటేష్ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ అంతగా కుదర్లేదనిపిస్తుంది. అటు అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సుహాస్, బ్రహ్మానందం, నిహారిక కొణిదెల తదితరులు అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్‌ను దర్శకుడు అశ్విన్ రామ్ వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. తొలి భాగం అంతా పెళ్లి కోసం హీరో పడే పాట్లు, పీటలపై పెళ్లి ఆగిపోవడం, ఆత్మహత్యకు యత్నించడం, ఆనందితో పరిచయం ఏర్పడటం, ఆపై వివాహం కూడా చేసుకోవడం అంతా చకచకా ఫన్నీ వేలో జరిగిపోతాయి. తొలి భాగంలో ఓవైపు నవ్విస్తూనే ఆడియన్స్ థ్రిల్‌ను సైతం పంచారు దర్శకుడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్టోరీ డల్ అయినట్లు అనిపిస్తుంది. పేలవమైన హీరోయిన్ గతం, కథంతా ఒకే దగ్గర తిరుగుతుంటం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ విషయంలోనూ డైరెక్టర్ బాగా కన్ఫ్యూజ్ చేసేశారు. ఓవరాల్‌గా సినిమాలో కొత్తదనం ఉన్నా ఆద్యంతం అలరించడంలో మాత్రం దర్శకుడు అశ్విన్ రామ్ తడబడ్డాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక వివేక్ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు వియషంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- ప్రియదర్శి, నభా నటేష్ నటన
- కామెడీ
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- సెకండాఫ్
- స్క్రీన్‌ప్లే
- సంగీతం
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్