మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.
ఆ భయం అక్కర్లేదు!
దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సాంగ్ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ మిడిల్లో సాధ్యం కాకపోతే ఎండ్ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
దుమ్మురేపిన తారక్
‘దేవర’ నుంచి సెప్టెంబర్ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్ హైట్పైనా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నిటినీ తారక్ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.
జాతీయస్థాయిలో ట్రెండింగ్
దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
‘పుష్ప 2’ను దాటేసిన ‘దేవర’
విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!