టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్-10 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం..
1. పూనకాలు లోడింగ్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.
2. శ్రీవల్లి
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్ సిద్ శ్రీరామ్‌కు మంచి పేరు వచ్చింది.
3. బుల్లెట్ సాంగ్
రామ్ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్ లవర్స్‌కు బాగా దగ్గరైంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్‌కు రామ్, కృతి డ్యాన్స్ తోడవడంతో ఈ సాంగ్ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.
4. జల జల జలపాతం నువ్వు
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయింది.
5. ఎంత సక్కగున్నావే
రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్‌చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ పాటకు మరింత హైప్ తీసుకొచ్చింది.
6. ప్రేమ వెన్నెల
చిరు మేనల్లుడు సాయిధరమ్ కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్ అని చెప్పాలి. లవ్ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడి సాంగ్‌గా నిలించింది.
7. మైండ్ బ్లాక్
మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్ మ్యూజిక్‌కు మహేశ్, రష్మి హై వోల్టెజ్ పర్‌ఫార్మెన్స్ తోడవడంతో సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది.
8. సీటీ మార్
అల్లుఅర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్‌కు అల్లు అర్జున్ క్లాస్ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్ పెరిగిపోయింది.
9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ప్రభాస్ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్‌గుడ్ సాంగ్స్‌ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్ సాంగ్స్‌లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
10. నువ్వుంటే
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ఇప్పటికీ సూపర్‌హిట్‌గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!