ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్ ఇస్మార్ట్’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ – హరీష్ శంకర్ కాంబోలోని ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఓ వైపు ప్రమోషన్స్.. మరోవైపు డిప్రెషన్!
ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్ & కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తగ్గని బచ్చన్ టీమ్!
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్ ఇస్మార్ట్’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్ నష్టాలను సెటిల్ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
వ్యూహామా లేదా గందరగోళమా?
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్ (ట్రైలర్, టీజర్, లిరికల్ సాంగ్స్, ప్రమోషన్ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్ చేయాలని ఇస్మార్ట్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘లైగర్’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్ బచ్చన్ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్ టీమ్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్ షురూ కాలేదని చెబుతున్నారు.
ఆ ఇష్యూ వల్లే రిలీజ్ చేస్తున్నాం: హరీశ్ శంకర్
రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జగన్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుదల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ అడుగగా హరీశ్ శంకర్ సమాధానం ఇచ్చారు. ‘పూరితో నేను పోల్చుకోలేను. ఆయన ఒక దిగ్గజం. ఆయనతో నా సినిమా వస్తుండటం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావడం వెనుక ముఖ్య కారణం ఓటీటీ ఇష్యూ ఉండడం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి సర్‌కి ఎలాంటి గొడవలు లేవు’ అంటూ హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!