• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆప్గాన్లో భూకంపం..వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

  బుధవారం తెల్లవారుజామున ఆప్గానిస్తాన్‌లో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం దాటికి వెయ్యి మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 1,500 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఖోస్ట్ నగరానికి దాదాపు 44 కి.మీ. దూరంలో భూకంపం సంభవించింది. మరణించిన వారు ఎక్కువగా తూర్పు ఆప్గాన్ ప్రావిన్స్ పక్టికాలో ఉన్నారు. అక్కడ దాదాపు 255 మంది మరణించగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లో 25 మంది మృతి చెందగా, 90 మందిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో డజన్ల ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv