• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రేమలో పడితే ‘గాల్లో తేలినట్టు’ ఎందుకుంటుందో తెలుసా? 

  ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ప్రేమలో ఉంటే అదేదో పాటలో చెప్పినట్లు గాల్లో తేలినట్టు, గుండె పేలినట్టు, రాయిపెట్టి కొట్టినట్టు ఉంటుంది. ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. ప్రతిక్షణం ఆనందంగా కూడా ఉంటుంది. గాలికి తిరిగే రాజుగాడు కూడా ఒక్కసారిగా బుద్ధిమంతుడైపోతాడు. అదే ప్రేమ విఫలమైతే బతుకే వ్యర్థమనిపిస్తుంది. ఆ విరహ వేదనలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.! ఇప్పుడు తెలుసుకుందాం.

  మెదడుపై ప్రేమ ప్రభావం

  హృదయంలో అలజడి రేపే జడివానే ప్రేమ అనుకుంటారు అందరూ.. కానీ నిజానికి ప్రేమ మెదడులో హర్మోన్లను అల్లాడించే తుపాను. 

  అమితానుభూతి (యుఫోరియా)

  అప్పటిదాకా అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, బాస్ బాధ పెట్టాడనో, ఇంటర్వ్యూ పోయిందనో వెలితిగా కూర్చుకున్న కుర్రాడు తన ప్రేయసి తలపు రాగానే ఒక్కసారిగా హుషారుగా మారిపోతాడు. కన్నీటిని చెమర్చిన కళ్లు ఒక్కసారిగా కాంతులను విరజిమ్ముతాయి. దీనికి కారణం డోపమైన్. మనకు ఇష్టమైన ఆహారం, సంగీతం ఇలా ఏది విన్నా విడుదలయ్యే ఈ రసాయనం ప్రేమించిన వారిని చూస్తే మాత్రం లావాలా ఉప్పొంగుతుంది. దీంతో అతడు లేదా ఆమెలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది.

  దృఢమైన అనుబంధం

  ఎవరొస్తే ఏంటి ఎవరు పోతే ఏంటి అనుకునే వాడు కూడా ఒకసారి పిల్ల ప్రేమలో పడ్డాక తాను లేకుంటే బతకలేనేమో అనుకుంటాడు. తనలో తన ప్రేయసి కూడా ఓ భాగమనుకుంటాడు. దీనికి కారణం ‘లవ్ హార్మోన్’గా పిలిచే ఆక్సిటోసిన్. ప్రేమించిన వ్యక్తిని టచ్ చేస్తే చాలు ఇది ఉత్పత్తవుతుంది.అందుకే ముద్దులు, కౌగిలింతలు ప్రేమను దృఢంగా చేస్తాయి.

  భావోద్వేగ మార్పులు

  త్యాగం– ప్రేమ కోసం కోట్ల ఆస్తినే వదులుకుంటాడు ఓ కుర్రోడు. మనసు దోచినోడిని మనువాడేందుకు కన్న తల్లిదండ్రులను, వారిచ్చే సిరిసంపదలను కాదనుకుంటుంది యువతి. ప్రేమించిన వ్యక్తి సంతోషం కోసం దేన్నైనా త్యాగం చేసేందుకు వెనకాడరు ప్రేమికులు. కొంతమందైతే కెరీర్ ను, జీవితాన్నే ఫణంగా పెడతారు.

  అసూయ– తనవాడు మరో ఆడదాన్ని కనీసం చూసినా తట్టుకోలేరు. అదే వేరే ఎవరితోనైనా స్నేహంగా ఉంటే సహించగలరా. ఇదే అసూయ. ప్రేమించిన వారిని ఎక్కడ కోల్పోతామో అనే భయం చాలామందిలో అసూయను పెంచుతుందట.

  ఒత్తిడి: ప్రేమలో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ ప్రేమ విఫలమైతే బతుకే భారంగా మారుతుంది. అందుకే ప్రేమలో ఉన్నోళ్ల ముఖం వెలిగిపోతే..ప్రేమను పోగొట్టుకున్నవారిలో కళ తప్పుతుంది.

  శారీరక మార్పులు

  ఇక కొన్ని పరిశోధనల ప్రకారం ప్రేమలో ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అలాగే వారి రోగ నిరోధక శక్తి మెరుగవుతోందట. బీపీ సంబంధింత సమస్యలూ తక్కువగానే ఉంటాయట. ఇక ప్రేమించిన వారికి అందంగా కనిపించేందుకు వ్యాయామం చేసే వారూ పెరుగుతున్నారట. ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయి మరి ప్రేమతో.

  ప్రేమ చేసే కీడు

  అనంద ఆకాశంలో విహరించిన ప్రేమ పావురాలు ఒకదానికొకటి దూరమైతే…! అది తెచ్చే మార్పులు కూడా గట్టిగానే ఉంటాయి. శారీరకంగా బలహీనపడిపోతారు, తిండి సహించదు, నిద్ర రాదు, పనిలో ఏకాగ్రత ఉండదు. జీవితమే కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. లవ్ అడిక్షన్ వంటి వింత సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు మానసికంగా గెలవడం కష్టమే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv