యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ హీరో. తారక్‌తో సినిమాలు తీసేందుకు ఇప్పటికే చాలామంది క్యూ కడుతుండగా… ఈ లిస్ట్‌లో హాలీవుడ్ దర్శకుడు చేరారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటనకి ఫిదా అయినట్లు తెలిపాడు ఈ హాలీవుడ్ డైరెక్టర్. దీంతో తారక్ గ్లోబల్ స్టార్ అయ్యాడంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
హాలీవుడ్‌కు తారక్
హాలీవుడ్ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్‌ను ఇటీవల ఇంటర్వ్యూల్లో ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏ భారతీయ నటుడితో చేయాలని ఉంది ఆయన్ని ప్రశ్నించగా… “ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో బోనులో నుంచి పులులతో పాటు వచ్చే యాక్టర్‌తో పని చేయాలని ఉంది” అన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం RRR చిత్రం చూడాలని ఓ నెటిజన్ సూచించగా… “ నేను చూశాను. అదరగొట్టేశారు” అనే సమాధానం ఇచ్చారు జేమ్స్ గన్.
సూపర్ హీరోస్ సినిమాలో
తారక్‌కు సంబంధించిన రోల్ గురించి కూడా గన్ మాట్లాడారు. అతడికి గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ చిత్రంలో ఏదైనా పాత్ర ఉందో చూడాలి అన్నారు. ఒకవేళ జేమ్స్ గన్(James Gunn)కు ఏదైనా రోల్ ఉందని అనిపిస్తే కచ్చితంగా అవకాశం ఇస్తాడు. నిజంగా జరిగితే.. హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ సినిమాలో యంగ్ టైగర్‌ను చూడొచ్చు.
లిస్ట్ పెరుగుతుంది
జూనియర్ ఎన్టీఆర్ దర్శకుల లిస్ట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో వార్ 2లో నటిస్తున్న యంగ్ టైగర్… అక్కడ మరిన్ని సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది. తమిళ్ దర్శకుడు వెట్రీమారన్ కూడా తారక్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. తెలుగులోనూ బడా డైరెక్టర్లు తారక్ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌కు చేరడంతో స్టార్‌డమ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాలీవుడ్‌పైనా ప్రశంసలు
బాలీవుడ్‌పై కూడా ప్రశంసలు కురిపించాడు దర్శకుడు జేమ్స్ గన్. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ(Guardians of the Galaxy)లో మ్యూజికల్ ఎలిమెంట్‌కు బాలీవుడ్ స్ఫూర్తి అని తెలిపారు. బాలీవుడ్ చిత్రాల్లో కళ, ఎంటర్‌టైన్‌మెంట్ తనని ఆకర్షిస్తుందని వెల్లడించారు. సినిమాకి హద్దులు లేవని… ప్రతి ఇండస్ట్రీ అన్నింట్లో భాగమేనని చెప్పారు జేమ్స్.
ఎవరీ దర్శకుడు
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన సినిమా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ. ఇందులో ఇప్పటికే రెండు పార్ట్‌లు విడుదల కాగా.. మరొకటి విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్ ప్రాట్, విన్ డీజిల్, బటిస్టా వంటి ఎంతోమంది స్టార్ నటులు నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వీటికి దర్శకత్వం వహించింది జేమ్స్ గన్.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!