కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. చాలా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎక్కువగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్ నటించిన సినిమాకు చేయాల్సినంత ప్రచారం అయితే జరగలేదు.
కథేంటంటే..
ఎక్స్-కల్నల్ జగపతి బాబు వాళ్ల గ్రామంలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటాడు. నేషనల్ లెవల్‌లో వారిని ఛాంపియన్స్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఊరిలో అందరూ బ్యాడ్ లక్ సఖి అనే పిలిచే సఖికి (కీర్తిసురేశ్) షూటింగ్‌లో మంచి పట్టుందని తెలుసుకొని ఆమెను ఛాంపియన్ చేసేందుకు కృషి చేస్తుంటాడు. బ్యాడ్ లక్ సఖి నుంచి ఆమె గుడ్ లక్ సఖిగా ఎలా మారిందని చెప్పడమే సినిమా కథ. ఇందులో గోలి రాజు (ఆది పినిశెట్టి) సఖి ప్రేమికుడిగా..సూరి (రాహుల్ రామకృష్ణ) తోటి షూటర్‌గా సఖిని ఎలా వెనక్కి నెట్టాలని చూస్తుంటాడు..? ఆమెను చూసి ఎందుకు అసూయ చెందుతాడో..? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇక్బాల్, డోర్ వంటి పలు హిందీ చిత్రాలు తీసిన నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డ్రామా, సవాళ్లు, ప్రతిసవాళ్లు, ప్రతీకారం వంటి అంశాలు సహజంగా ఉంటాయి. అయితే అందులో దాన్ని కొత్తగా ప్రేక్షకులకు చెప్పడం, ఆసక్తికరంగా తెరకెక్కించడంలోనే అసలైన ఛాలెంజ్ ఉంటుంది. ఈ సినిమాలో దాన్ని అందుకోలేకపోయాడు దర్శకుడు. అనుభవజ్జుడైన దర్శకుడు అయినప్పటికీ రసవత్తరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.
ఈ సినిమా ఆరంభంలోనే పట్టుతప్పింది. స్క్రీన్‌ప్లే సరిగ్గా లేకపోవడం కారణంగా కథ చప్పగా సాగినట్లుగా అనిపిస్తుంది. ముందుగా ఊహించనట్లుగానే సాగుతుంటుంది. దీంతో ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టంగా మారింది. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.
గుడ్ లక్ సఖిలో ముఖ్యంగా చెప్పుకోదగిన పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా సృష్టించడం. అది తప్ప సినిమా గురించి పెద్దగా ఏమీ ఉండవు. జగపతి బాబు చెప్పే డైలాగ్స్ కొన్ని ఆలోచింజేసేలా ఉంటాయి.
లవ్ స్టోరీలో కూడా చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపించడం, అవి లాజిక్ లేకుండా ఉండటంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంటుంది. క్రీడాస్ఫూర్తి ఆలోచన సరైనదే, కానీ దాని ప్రదర్శనలో నాటకీయత లేదు. ప్రేమకథ విషయంలోనూ అలాగే ఉంటుంది. ఏజ్ గ్యాప్ అంశాన్ని తీసుకొచ్చారు కానీ దానికి జస్టిఫికేషన్ ఇవ్వకుండానే ముగించారు. కొన్ని సీన్లు సినిమా నిడివి కోసం యాడ్ చేసినట్లు మాత్రమే ఉంటాయి.
మొత్తంమీద, గుడ్ లక్ సఖి బోరింగ్ సఖిగా మారింది. బలహీనమైన పాత్రలు, నాటకీయత లేకపోవడం, కథనం సరిగ్గా లేకపోవడంతో స్పోర్ట్స్ డ్రామా ఆసక్తికరంగా లేదు. స్పోర్ట్స్ డ్రామాలో కథాపరంగా ప్రత్యామ్నాయంగా చేసేదేమి ఉండదు. ఇక్కడ దృష్టి సారించాల్సింది కథనం, నాటకీయ సంఘర్షణను పెంచడం. షూటింగ్‌కి సంబంధించిన స్పోర్ట్స్ సీక్వెన్స్‌లు కూడా ఇంకా థ్రిల్లింగ్‌గా తీయవచ్చు.
ఎవరెలా చేశారంటే..
కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కీలక పాత్రలు పోషించారు. కీర్తి సురేశ్ ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఆది థియేటర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో చక్కగా నటించాడు. కానీ కీర్తి సురేశ్, ఆది మధ్య ఎమోషన్స్ అంతగా పండలేదు. జగపతి బాబు పాజిటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ తన పరిధి మేరకు నటించాడు.
దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించిన పాటల్లో బ్యాడ్ లక్ సఖి పాట తప్ప మిగతావి ఆశించిన స్థాయిలో లేవు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త మెరుగ్గా ఉంది. సాంకేతికంగా చాలా లోపాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండాల్సింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డబ్బింగ్‌లో సమస్యలు ఉన్నాయి.
రేటింగ్: 2/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!