• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GOOGLE BARD: చాట్‌జీపీటీని మించేలా గూగుల్‌ బార్డ్‌… ఏకంగా కోడింగ్‌ రాసేలా రూపకల్పన

    ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ పోటీ నెలకొంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ హవా నడుస్తుంటే.. పోటీగా ఓపెన్‌ ఏఐని తీసుకువచ్చేందుకు చాలా సంస్థలే పనిచేస్తున్నాయి. ఇందులో గూగుల్‌ మెుదటి స్థానంలో ఉంది. కంపెనీకి సంబంధించిన చాట్‌బాట్‌ బార్డ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉండగా.. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

    గూగుల్ బార్డ్‌

    గూగుల్‌ అభివృద్ది చేస్తున్న ఓపెన్‌ ఏఐ బార్డ్‌. ఇది పాత చాట్‌బాట్‌ అయినప్పటికీ దీన్ని చాట్‌జీపీటీకి పోటీగా మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉంది. అమెరికా, బ్రిటన్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌ కోసం తెచ్చే ప్రయత్నాలు మెుదలుపెట్టారు.

    బార్డ్‌తో కోడింగ్‌

    బార్డ్‌ చాట్‌బాట్‌ సహాయంతో సాఫ్ట్‌వేర్‌ టాస్క్‌లను చేయడంతో పాటు ప్రోగ్రామింగ్‌ కూడా రాసేలా రూపొందిస్తున్నారు. కోడ్‌ను జనరేట్‌ చేయడంతో పాటు డీబగ్‌ చేసేలా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 20 ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో ఈ సౌకర్యం ఉండనుంది. C++, Go, JAVA, JAVASCRIPT, PYTHON, TYPE SCRIPT వంటి లాంగ్వేజెస్‌కి కోడింగ్‌ రాయవచ్చు. పైథాన్‌ కోడ్‌ను గూగుల్‌ కొలాబ్‌కు సులభంగా కాపీ, పేస్ట్‌ అవసరం లేకుండా ఎక్స్‌పోర్ట్‌ చేయవచ్చు. గూగుల్‌ షీట్స్‌ ఫంక్షన్స్‌ను కూడా బార్డ్‌ సహాయంతో రాయవచ్చని యాజమాన్యం తెలిపింది. 

    యూజర్ ఫ్రెండ్లీ

    కోడ్‌ను జనరేట్‌ చేయడమే కాకుండా దాని గురించి వినియోగదారులకు వివరించేలా బార్డ్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఏదైనా ప్రోగ్రామ్‌ను మెుదటిసారి నేర్చుకుంటున్నట్లయితే ఇది సహాయపడుతుంది. ఔట్‌పుట్‌కు సంబంధించి ఏదైనా అదనపు సహాయం కావాలన్న ఉపయోగపడేలా రూపుదిద్దుకుంటుంది చాట్‌బాట్‌. 

    కోడ్‌ డీబగ్‌

    కోడి డీబగ్గింగ్‌లోనూ బార్డ్‌ హెల్ప్‌ చేస్తుందని యాజమాన్యం తెలిపింది. కోడ్‌లో ఏదైనా ఎర్రర్‌ వచ్చినా లేదా అనుకున్న కోడ్‌ కాకపోతే.. “ ఈ కోడ్ పనిచేయదు. ఫిక్స్‌ ఇట్‌” అని చెబితే సరిపోతుంది. అప్పుడు డీబగ్గింగ్‌ కోసం బార్డ్ సహాయ పడుతుంది. అంతేకాదు, అత్యంత వేగంగా పనిచేసే సామర్థ్యం బార్డ్‌ కలిగి ఉంటుందని వెల్లడించారు. 

    వినియోగం మెుదలైంది

    ప్రజలు నిత్యం చేసే కొన్ని పనులకు బార్డ్ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది. ప్రజెంటేషన్లు రూపొందించడం, పాఠ్య ప్రణాళికలు రాయడం వంటివి చేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం తీసుకువస్తున్న అదనపు ఫీచర్స్‌తో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మరింత వేగాన్ని పెంచబోతున్నట్లు తెలిపారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహకంగా మారటంతో పాటు క్లిష్టమైన ఇంజినీరింగ్‌ సవాళ్లను అధిగమించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv